Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drone Attack: యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)పై జరిగిన భారీ డ్రోన్ దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. అబుదాబిలోని ప్రముఖ ‘బరకా అణు విద్యుత్ కేంద్రం’ వెలుపల ఈ దాడి జరగ్గా, అనంతరం అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇరాన్‌కు చెందిన డ్రోన్ ద్వారానే ఈ దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు.
అబుదాబి మీడియా కార్యాలయం నివేదికల ప్రకారం.. బరకా అణు విద్యుత్ కేంద్రం వెలుపలి భద్రతా వలయం (సెక్యూరిటీ పెరిమీటర్) సమీపంలో ఈ డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో ప్లాంట్ ప్రాంగణంలోని ఒక విద్యుత్ జనరేటర్‌కు మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడి వల్ల ఎలాంటి రేడియేషన్ లీకేజీ కాలేదని, అణు భద్రతకు సంబంధించిన ఎలాంటి సమస్యలు తలెత్తలేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
అరబ్ ప్రపంచంలోనే తొలి అణు కేంద్రం..
అల్ ధఫ్రా ప్రాంతంలో ఉన్న ఈ ‘బరకా అణు విద్యుత్ కేంద్రం’ అరబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ ప్లాంట్ కావడం గమనార్హం. యూఏఈ మొత్తం విద్యుత్ సరఫరాలో మెజారిటీ వాటాను ఈ ప్లాంటే అందిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రక్షణ, అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం ప్లాంట్‌లోని అన్ని యూనిట్లు సాధారణంగానే పనిచేస్తున్నాయని, కీలక వ్యవస్థలకు ఎలాంటి నష్టం జరగలేదని ‘ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్’ (FANR) ప్రకటించింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని యూఏఈ ప్రభుత్వం ప్రజలను కోరింది.
గత ఫిబ్రవరి 28న ఇరాన్‌తో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈ లక్ష్యంగా అనేక క్షిపణి, డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. గతంలోనూ ఇక్కడి ఇంధన కేంద్రాలు, సముద్ర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. తాజా దాడికి ఇరాన్ నేరుగా బాధ్యత వహించనప్పటికీ, దానికి సంబంధించిన డ్రోన్లను ఉపయోగించినట్లు యూఏఈ అధికారులు ధృవీకరించారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్‌పై దాడులు స్టార్ట్ చేసినప్పటి నుంచి యూఏఈ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటివరకు ఇరాన్ యూఏఈపై దాదాపు 2,800కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం.
మరోవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలు పూర్తిగా ఆగిపోయాయి. అమెరికా ఇరాన్‌పై దాడులను గత నెలలోనే నిలిపి వేసినప్పటికీ, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ పై ఇరాన్ కఠినమైన నియంత్రణను కొనసాగిస్తోంది. ఈ మార్గంలో చమురు రవాణాకు అంతరాయం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది, దీని ఫలితంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరు దేశాలు పట్టు విడువకపోవడంతో శాంతి చర్చలు ప్రస్తుతానికి లేనట్లే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!