NTV Telugu Site icon

వామ్మో.. అక్షరాలా రూ.16 లక్షలను చెత్తలో పడేసిన వ్యాపారి.. ఎందుకో తెలిస్తే షాకే..?

డబ్బుకోసం ప్రతి ఒక్కరూ క్షణమ్ తీరికలేకుండా పనిచేస్తుంటారు. ఇక వ్యాపారులు అయితే సరేసరి.. వారికి తినడానికి కూడా సమయం ఉండదు. ఇక అలాంటి ఒక వ్యాపారి అనుకోకుండా ఒక పొరపాటు చేశాడు.. ఆ పొరపాటు విలువ అక్షరాలా రూ. 16 లక్షలు. ఒక్క రూపాయి కిందపడితేనే ఎవరు చూడకుండా జేబులో వేసుకొనే జనల మధ్య ఏకంగా రూ. 16 లక్షలను చెత్తకుప్పలో వేస్తే.. ఊరుకుంటారా..? ఎంచక్కా డబ్బుతో పరారయ్యారు.. అసలు అక్కడ ఏం జరిగింది.. అంతగా వ్యాపారి చేసిన పొరపాటు ఏంటిది అనేది చూద్దాం.

గ్రీకు దేశంలో ఒక వ్యాపారి, కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడికి ఆ దేశంలో చాలా షాపులు ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ ఈయన చూసుకుంటుండగా.. మిగతా బ్రాంచ్ లు అతని భాగస్వాములు నడుపుతున్నారు. ఇక ఎప్పటిలానే షాపులో ఉన్న డబ్బును, ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొని షాపు ఓపెన్ చేయడానికి వ్యాపారి బయల్దేరాడు. షాపు త్వరగా ఓపెన్ చేయాలనే ఆత్రంతో డస్ట్‌బిన్‌లో చెత్త సంచీతోపాటు పొరపాటున మరో చేతిలో ఉన్న 19వేల యూరోలు(సుమారు రూ.16లక్షలు)గల బ్యాగును కూడా అందులో పడేశాడు. ఇంకేముంది షాపుకు వెళ్లి చూడగా డబ్బు కనిపించలేదు.

వ్యాపారి తేరుకోని చెత్తకుప్ప దగ్గరకు వెళ్లి చూడగా డబ్బు సంచి కనిపించలేదు. అక్షరాలా రూ. 16 లక్షలు చేజారడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిచాడు. వారి సహాయంతో చెత్తను తీసుకెళ్లే వాహానాన్ని ట్రేస్ చేసి పట్టుకున్నాడు. అనంతరం అందులో వెతికాడు. అయినా అతనికి డబ్బు దొరకలేదు. గంట సేపు విశ్వ ప్రయత్నాలు చేసి, అన్ని చెత్త వాహనాలను వెతకగా ఎట్టకేలకు డబ్బు కంటపడింది. అప్పటివరకు ప్రాణాలను బిగబట్టుకున్న వ్యాపారికి ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చింది. ఇక ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.. అరెరే మేము వ్యాపారి వేసిన సంచులను చూసాం కానీ అందులో డబ్బు ఉందని గుర్తించలేకపోయామే అని స్థానికులు కూసింత కోపాన్ని చూపిస్తున్నారు.