Viral News: భూమ్మీద నడిచే వాహనాల్లోకి ఏ కుక్కో, పిల్లో, కోడో చేరిందంటే వెంటనే ఆపేసి బయటకు వేసేస్తాం. అదే ఆకాశంలో ఎగిరే విమానంలోకి ఓ పక్షి వెళ్తే..! మనం అనుకోవచ్చు.. అంతా పైనుండి వెళ్లే విమానంలోకి పక్షులు వెళ్తాయా అని.. నిజమే వెళ్లింది ఓ పక్షి. అంతేకాకుండా ఆ పక్షి విమానాన్ని ఢీకొట్టి.. లోపలికి దూసుకెళ్లింది.
Read Also: Madhyapradesh: ముస్లిం మహిళను లేపుకెళ్తే రివార్డ్.. ప్రకటించిన హిందూ ధర్మ సేన
ఈక్వెడార్‌లో ఓ పైలట్ కు వింత ఘటన ఏర్పడింది. పాపం అతని ప్రాణం పోతున్నా.. విమానం 10,000 అడుగుల ఎత్తులో ఉండగా ఆండియన్ కాండోర్ అనే ఓ భారీ పక్షి ఢీకొట్టింది. విండ్ షీల్డ్ బాగా దెబ్బతింది. కాక్‌పిట్‌లో ఆ పక్షి ఇరుక్కుపోయినా, పైలట్ భయపడలేదు. పైలట్‌కు కూడా బాగా దెబ్బలు తగిలాయి. అతడి ముఖం అంతా గాయాలై, రక్తం కారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చివరకు ఆ ఫైలట్ ధైర్యంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు.
Read Also: Revanth Reddy : ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారు
ఆ పెద్ద పక్షి దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినట్టుగా సమాచారం. అవి “ప్రపంచంలో అతిపెద్ద ఎగిరే పక్షి” అని అంటారు. ఆ పక్షులు గాలిలో 21వేల 300 అడుగుల ఎత్తులో కూడా ఎగురుతాయని కొందరు అంటున్నారు.
Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province.#avgeeks 🚁✈️ #PilotsLife
pic.twitter.com/KjJGyzdSnQ— Ashoke Raj (@Ashoke_Raj) June 16, 2023