Helicopters Crash: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బ్లాక్ హాట్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో 9 మంది అమెరికన్ సైనికులు మరణించారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ శిక్షణలో ఈ ప్రమాదం జరిగినట్లు మిలిటరీ అధికార ప్రతినిధి గురువారం తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్లు 101వ వైమానిక విభాగానికి చెందినవని, తొమ్మిది మంది సైనికులు మరణించారని దీని ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఆంథోనీ హోఫ్లర్ తెలిపారు.
ఫోర్ట్ క్యాంప్‌బెల్‌కు వాయువ్యంగా కెంటుకీలోని ట్రిగ్ కౌంటీలో బుధవారం రాత్రి 10:00 గంటలకు క్రాష్ సంభవించిందని యూఎస్ ఆర్మీ తెలిపింది. సంఘటన సమయంలో రెండు హెచ్ హెచ్ 60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు ఎగురుతున్నాయి. రెండు హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. గత కొన్ని ఏళ్ల తర్వాత యూఎస్ మిలిటరీలో జరిగిన ఘోర ప్రమాదంగా ఇది నిలిచింది.
Read Also: New Parliament: కొత్త పార్లమెంట్ అదిరింది.. ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ..
ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ జాన్ లూబాస్, డివిజన్ యొక్క ఆపరేషన్స్ డిప్యూటీ కమాండింగ్ ఆఫీసర్, హెలికాప్టర్లు ఎందుకు కూలిపోయాయనే దాని గురించి ఇప్పటివరకు చాలా తక్కువగా తెలుసని వెల్లడించారు. హెలికాప్టర్లలోని బ్లాక్ బాక్సులను విశ్లేషించడానికి అలబామాలోొని ఫోర్ట్ రకర్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. కూలిపోయిన ఓ హెలికాప్టర్ లో ఐదుగురు, మరో హెలికాప్టర్లో నలుగురు సైనికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై అమెరికా రాజకీయ నాయకులు, ఆర్మీ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి
ఫోర్ట్ క్యాంప్‌బెల్ 101వ వైమానిక విభాగానికి ముఖ్య స్థావరం. యునైటెడ్ స్టేట్స్‌లోని అతిపెద్ద సైనిక స్థావరాలలో ఒకటి. 2018లో ఫోర్ట్ క్యాంప్‌బెల్‌లో శిక్షణ సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు US సైనికులు మరణించారు. “స్క్రీమింగ్ ఈగల్స్” అనే మారుపేరుతో ఈ విభాగం ఆగస్టు 1942లో ప్రారంభం అయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో డీ-డే ల్యాండింగ్స్, బాటిల్ ఆఫ్ ది బల్జ్‌లో పేరు సంపాదించింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో ఈ విభాగం కీలక పాత్ర పోషించింది.