NTV Telugu Site icon

Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. 9 మంది…

Usa

Usa

Texas Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. టెక్సాస్ లోని డల్లాస్ శివారు అలెన్ లోని అవుట్‌లెట్ మాల్‌లో శనివారం ఒక సాయుధుడు అక్కడ ఉన్న ప్రజలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు హతమార్చారు.

Read Also: Kanti Velugu : కంటి వెలుగులో 1.34 కోట్ల మందికి పైగా పరీక్షలు

ఒక్కసారిగా ఎదురైన ఈ హింసాత్మక కాల్పులతో వందలాది మంది మాల్ నుంచి భయాందోళనతో పారిపోయారు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు చంపినట్లు పోలీస్ అధికారి బ్రియాన్ హార్వే విలేకరుల సమావేశంలో తెలిపారు. తుపాకీ కాల్పుల వల్ల 9 మంది గాయాల పాలయ్యారు. వీరందరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెడికల్ సిటీ హెల్త్‌కేర్, డల్లాస్-ఏరియా హాస్పిటల్ సిస్టమ్ గాయపడిన వారందరికి చికిత్స చేస్తున్నట్లు వెల్లడించింది. కాల్పులు జరిగిన వెంటనే వందలాది మంది ప్రజలు భయంతో మాల్ నుంచి బయటకు వెళ్లడం టీవీల్లో ప్రసారమయ్యాయి.