New Zealand: న్యూజీలాండ్‌లో 80 మిలియన్ ఏళ్ల నాటి సముద్ర రాక్షసుడు అవశేషాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand: పొలాలు దున్నుతున్నప్పుడు కొన్ని చోట్ల లంకె బిందెలు బయటపడుతుంటాయి.. పాత ఇళ్లను కూల్చివేసి కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం తవ్వకాలు జరుపుతుంటే పురాతన నాణాలు బయటపడుతుంటాయి. కొన్ని చోట్ల వరదలు వచ్చినప్పుడు వెనుకటి కాలం నాటి నగరాల అవశేషాలు బయటపడుతుంటాయి. ఇలా కొన్ని సందర్భాల్లో పురాతన వస్తువులు, వెనుకటి తరాల వారి జీవన విధాన విశేషాలు బయటపడుతుంటాయి. అలాంటి సంఘటనే న్యూజీలాండ్‌లోనూ జరిగింది. అదీ కూడా గాబ్రియల్ తుఫాన్ మూలంగా జరిగింది. వరదల తాకిడికి 80 మిలియన్ సంవత్సరాల నాటి సుముద్ర రాక్షసుడి అవశేషాలు బయటపడ్డాయి.
Read also: Encounter: కాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం..
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
న్యూజీలాండ్‌ను గాబ్రియల్ తుఫాన్ తీవ్ర నష్టానికి గురి చేసింది. తుఫాన్ తాకిడికి వరదలు విపరీతంగా వచ్చాయి. ఈ వరదల కారణంగా 80 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన జెయింట్ ‘సీ మాన్స్టర్'(సముద్ర రాక్షసుడు) శిలాజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గాబ్రియెల్ తుఫాను యొక్క వరదనీరు వెలికితీసిన సమయంలో పురాతన సముద్ర రాక్షసుడు యొక్క అవశేషాలు బయటపడ్డాయి. ఫిబ్రవరిలో హాక్స్ బేలోని లోతట్టు ప్రాంతాల గుండా వచ్చిన గాబ్రియెల్ తుఫాను నుండి వచ్చిన వరద నీటి కారణంగా ఈ పురాతన శిలాజాలు బయటపడ్డాయని శాస్ర్తవేత్తలు తెలిపారు. మౌంగతనివా స్థానిక అడవిలో చరిత్రపూర్వ అవశేషాలు కనుగొనబడినట్లు ఒక వార్తా సంస్థ మరింత నివేదించింది.
Read also: Samsung Galaxy M34 5G Launch: శాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. సూపర్ లుకింగ్, బెస్ట్ ఫీచర్స్!
పాలియోంటాలజిస్టులు రెండు శిలాజ వెన్నుపూసలను కొనుగొన్నారు. వాస్తవంగా ఈ శిలాజాలను మార్చిలోనే కనుగొనబడినప్పటికీ.. ఇప్పుడు ప్రకటించబడ్డాయి, 45 అడుగుల (14 మీటర్లు) పొడవు వరకు పెరిగే భారీ, పొడవాటి మెడ గల సముద్ర సరీసృపాలు ఎలాస్మోసారస్కు చెందినవి కావచ్చని శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నారు. డైనోసార్ యుగంలో ఆహార గొలుసు ఎగువన వేటాడే భారీ సముద్ర సరీసృపాలు మోసాసార్కు చెందిన మరొక శిలాజ వెన్నుపూసను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. న్యూజిలాండ్‌లో మొససార్ శిలాజాలు కనుగొనబడ్డాయి మరియు 2015లో మాంగహౌంగా ప్రవాహంలో పాక్షిక దవడ కనుగొనబడింది. న్యూజిలాండ్ యొక్క స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలాన్ని రక్షించే పరిరక్షణ అయిన ఫారెస్ట్ లైఫ్‌ఫోర్స్ రిస్టోరేషన్ ట్రస్ట్ నుండి సిబ్బంది మరియు వాలంటీర్లు ఈ శిలాజాలను కనుగొన్నారని లైవ్ సైన్స్ తెలిపింది.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..