NTV Telugu Site icon

Qatar: 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్..

Quatar

Quatar

Qatar: ఏడాది కాలంగా నిర్భంధంలో ఉన్న 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి ఖతార్ మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ పౌరులను సురక్షితంగా ఉంచేందుకు అన్ని చట్టపమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని భారత్ తెలిపింది. శిక్ష విధింపబడిన 8 మంది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ అయిన దహ్ర గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు.

Read Also: KS Ratnam: బీఆర్ఎస్ కు భారీ షాక్.. రేపు బీజేపీలో చేరనున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం

ఏడాదిగా నిర్భంధంలో ఉంటున్న వీరు పలుమార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా అనేక సార్లు తిరస్కరించారు. వారి నిర్బంధాన్ని ఖతార్ అధికారులు పొడగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖతార్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు ఈ రోజు వీరికి మరణశిక్ష విధించింది. ఈ విషయంలో మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సదరు వ్యక్తుల కుటుంబ సభ్యులు, న్యాయనిపుణులతో టచ్ లో ఉన్నామని చెప్పింది.

వీరిపై గూఢాచర్య అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ తరుపున ఓ జలంతర్గామి ప్రోగ్రామ్ కోసం గూఢచర్యానికి పాల్పడినట్లు అభియోగాలు మోపి ఖతార్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఈ కేసును రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్ట్ తో పాటు అతని భాగస్వామని దేశం వదిలి వెళ్లమని ఖతార్ అధికారులు ఇటీవల ఆదేశించారని తెలిసింది. ప్రస్తుతం మరణశిక్ష ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్లు నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ట్, కమాండర్లు అమిత్ నాగ్‌పాల్, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ ఉన్నారు. వీరిపై గతేడాది ఆగస్టులో ఖతార్ అభియోగాలు మోపింది.