Site icon NTV Telugu

China: ఏడాదికి 64 వేల పిల్లలను కడుపులోనే బలి తీసుకుంటున్న కాలుష్యం

Air Pollution

Air Pollution

64,000 Babies Die In Womb Every Year Because Of Polluted Air In China: చైనాలో కాలుష్యం తీవ్రత అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల పుట్టుకపై ప్రభావం కనిపిస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్భంలోనే పిండం మరణించే దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంది. ప్రతీ ఏడాది అక్కడి 64,000 మంది శిశువులు గర్భంలోనే మరణిస్తున్నారు. దీనంతటికి చైనా వ్యాప్తంగా ఉన్న కాలుష్యమే కారణం అని తెలిసింది. రాజధాని బీజింగ్ లో గత పదేళ్ల నుంచి కాలుష్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది చైనా ప్రభుత్వం. అయినప్పటికీ శిశువుల మరణాలు సంభవిస్తున్నాయిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక వెల్లడించింది.

Read Also: Boora Narsaiah Goud: కేసీఆర్ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్.. ఆ తప్పులన్నీ కేంద్రంపై నెట్టారు

137 దేశాల్లో జరిగిన అధ్యయనం ప్రకారం 2015లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో 40 శాతం శిలాజ ఇంధనాల దహనం వల్ల గాలిలో పార్టిక్యులర్ మ్యాటర్ (పీఎం) 2.5 పెరగడానికి కారణం అయింది. నేచర్ కమ్యూనికేషన్స్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గాలిలో కాలుష్యం పెరగడం వల్ల గర్భంలోనే పిండం మరణించే సంఖ్యలో చైనా 4వ స్థానంలో ఉంది. గాలి నాణ్యత మెరుగుపరచడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించవచ్చని పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

గర్భంలో ఎదుగుతున్న పిండాలపై గాలి కాలుష్యం గణనీయంగా ప్రభావం చూపిస్తుందని తేలింది. అయితే ఇటీవల కాలంలో చైనా తీసుకుంటున్న కాలుష్య నివారణ చర్యలు మరణాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. గాలిలో ఉన్న కాలుష్యం వల్ల పిండానికి తగినంత ఆక్సిజన్ అందడం లేదని అందుకే మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

Exit mobile version