China: ఏడాదికి 64 వేల పిల్లలను కడుపులోనే బలి తీసుకుంటున్న కాలుష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
64,000 Babies Die In Womb Every Year Because Of Polluted Air In China: చైనాలో కాలుష్యం తీవ్రత అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల పుట్టుకపై ప్రభావం కనిపిస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్భంలోనే పిండం మరణించే దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంది. ప్రతీ ఏడాది అక్కడి 64,000 మంది శిశువులు గర్భంలోనే మరణిస్తున్నారు. దీనంతటికి చైనా వ్యాప్తంగా ఉన్న కాలుష్యమే కారణం అని తెలిసింది. రాజధాని బీజింగ్ లో గత పదేళ్ల నుంచి కాలుష్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది చైనా ప్రభుత్వం. అయినప్పటికీ శిశువుల మరణాలు సంభవిస్తున్నాయిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక వెల్లడించింది.
Read Also: Boora Narsaiah Goud: కేసీఆర్ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్.. ఆ తప్పులన్నీ కేంద్రంపై నెట్టారు
Also Read
137 దేశాల్లో జరిగిన అధ్యయనం ప్రకారం 2015లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో 40 శాతం శిలాజ ఇంధనాల దహనం వల్ల గాలిలో పార్టిక్యులర్ మ్యాటర్ (పీఎం) 2.5 పెరగడానికి కారణం అయింది. నేచర్ కమ్యూనికేషన్స్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గాలిలో కాలుష్యం పెరగడం వల్ల గర్భంలోనే పిండం మరణించే సంఖ్యలో చైనా 4వ స్థానంలో ఉంది. గాలి నాణ్యత మెరుగుపరచడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించవచ్చని పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
గర్భంలో ఎదుగుతున్న పిండాలపై గాలి కాలుష్యం గణనీయంగా ప్రభావం చూపిస్తుందని తేలింది. అయితే ఇటీవల కాలంలో చైనా తీసుకుంటున్న కాలుష్య నివారణ చర్యలు మరణాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. గాలిలో ఉన్న కాలుష్యం వల్ల పిండానికి తగినంత ఆక్సిజన్ అందడం లేదని అందుకే మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!