Site icon NTV Telugu

Illicit Relationship: టీనేజ్ విద్యార్థులతో ఆరుగురు మహిళా టీచర్ల లైంగిక సంబంధం.. అరెస్ట్..

Usa

Usa

Illicit Relationship: ఆరుగురు మహిళా టీచర్లు విద్యార్థులతో లైంగిక సంబంధాలు నెరపడంతో అమెరికా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెండు రోజలు వ్యవధిలో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని డాన్ విల్ కు చెంది ఎలెన్ షెల్(38) 16 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అర్కన్సాకు చెంది హెథర్ హరే(32) మరో టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు కేసు నమోదు అయింది.

Read Also: Sudan: సూడాన్ ఘర్షణల్లో 61 మంది మృతి.. మృతుల్లో కేరళ వాసి

ఓక్లహామాకు చెందిన ఎమిలీ హాన్ కాక్(26) కూడా తన విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను కూడా అరెస్ట్ చేవారు. ఇదిలా ఉంటే లింకన్ కౌంటీలో ఓ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ ఎమ్మా డిలానే, అదే స్కూల్ లో చదువుతున్న 15 ఏళ్ల విద్యా్ర్థితో అనైతిక సంబంధాన్ని నడుపుతోంది. అయోవాలోని ఓ హైస్కూల్ లో క్రిస్టెన్ గ్యాంట్ అనే టీచర్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. వర్జీనియాలోని హైస్కూల్ లోని ఓ మహిళా టీచర్(33) ఓ విద్యార్థితో తప్పుగా ప్రవర్తిస్తుందనే అభియోగాలతో కేసు నమోదు అయింది. పెన్సిల్వేనియాకు చెందిన జావెలిన్ కోచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా టీచర్లంతా 26 నుంచి 40 ఏళ్ల మధ్యవాళ్లే.

Exit mobile version