Site icon NTV Telugu

Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..

Earthquake

Earthquake

Earthquake: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ భాగంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఇప్పటి వరకు నష్టానికి సంబంధించిన అంచనాలు తెలియరాలేదు. దక్షిణ ద్వీపమైన మిండానాలోలోని సారంగని ప్రావిన్స్‌లో భూకంప వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూమి అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు చేయలేదు. ప్రాణనష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదు, కానీ పర్వతాలు ఎక్కువగా ఉన్న ద్వీపంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.

Read Also: Deepfakes: “డీప్‌ఫేక్” అతిపెద్ద ముప్పు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..

తాను ఇప్పటి వరకు చూసిన అత్యంత బలమైన భూకంపం ఇదే అని 27 ఏళ్ల కిషియా లేరాన్ తెలిపారు. ఆమె భూకంప కేంద్రం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దావో సిటీలో ఉంటున్నాడు. అక్కడ సమావేశంలో ఉన్న సమయంలోనే భూకంపం వచ్చిందని, తన చుట్టూ ఉన్న వ్యక్తులు భయాందోళనతో పరుగులు తీశారని చెప్పింది.

జపాన్ నుంచి ఆగ్నేయాసియా వరకు ఉన్న పసిఫిక్ బేసిన్ భూకంపాలు, అగ్నిపర్వతాలకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతాన్ని ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలోనే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఇక్కడి సముద్ర గర్భంలో వందల సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.

Exit mobile version