Site icon NTV Telugu

ఆ దేశంలో స‌గం మంది జ‌నాభాకు వ్యాక్సినేష‌న్ పూర్తి…

క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం.  వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌ను ప్ర‌పంచంలోని చాలా దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.  ధ‌నిక దేశాల్లో వ్యాక్సిన్ కొర‌త లేన‌ప్ప‌టికీ కొన్ని చోట్ల వేగంగా సాగ‌డంలేదు.  జులై 4 వ‌ర‌కు అమెరికాలో 70 శాతం మందికి వ్యాక్సినేష‌న్ అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ప్ప‌టికీ ఆ ల‌క్ష్యం నెర‌వేర‌లేదు.  2020 డిసెంబ‌ర్ 14 వ తేదీన అమెరికాలో వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించారు.  ప్రారంభంలో వేగంగా కొన‌సాగినా మ‌ధ్య‌లో కొంత‌మేర మంద‌గించింది.  దీంతో అధ్య‌క్షుడు జో బైడెన్ నిర్ధేశించిన 70 శాతం మందికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జులై 4 వ‌ర‌కు పూర్తికాలేదు.  అమెరికాలో స‌గం జ‌నాభాకు వ్యాక్సినేష‌న్ పూర్తి కావ‌డానికి 33 వారాల స‌మయం ప‌ట్టిన‌ట్టు వ్యాక్సినేష‌న్ స‌మాచార విభాగానికి డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సైర‌స్ షాప‌ర్ ప్ర‌క‌టించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు 165 మిలియ‌న్ల మందికి వ్యాక్సినేష‌న్ అందించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.  

Read: “మనీతో పాటూ మనసులు కూడా గెలుచుకో”మంటోన్న ఎన్టీఆర్!

Exit mobile version