NTV Telugu Site icon

Hamas: నలుగురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్.. మీడియా ఎదుట చిరునవ్వులు

Hamasisrael

Hamasisrael

హమాస్ చెరలో ఉన్న నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఉగ్రవాదులు విడిచిపెట్టారు. సైనిక దుస్తుల్లో తీసుకొచ్చి రెడ్‌క్రాస్ సభ్యులకు అప్పగించారు. నలుగురు బందీలు కూడా మీడియా ముందు చిరునవ్వులు చిందిస్తూ విక్టరీ సింబల్ చూపించారు. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్‌ను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Indonesia President : భారత్ చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు.. పలు రంగాల్లో ఇరు దేశాలకు కుదిరిన ఒప్పందాలు

శుక్రవారం హమాస్ కీలక ప్రకటన చేసింది. నలుగురు మహిళా ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అన్నట్టుగానే శనివారం సైనిక దుస్తుల్లో తీసుకొచ్చి విడుదల చేసింది. అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెలీయులను బందీలుగా తీసుకెళ్లిపోయింది. ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఒప్పందం జరిగింది. అనంతరం ముగ్గురు బందీలను విడిచిపెట్టింది. తాజాగా శనివారం మరో నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: NTPC: నెలకు రూ. 60 వేల జీతంతో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి

అయితే ఒప్పందం ప్రకారం హమాస్ బందీలను విడిచిపెట్టినట్లుగానే.. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. అయితే ఎంత మందిని విడిచిపెట్టారన్న విషయం మాత్రం ఇప్పటివరకు ఇజ్రాయెల్ ప్రకటించలేదు.

హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇటీవల ఖతర్, యూఎస్ చర్చలు జరిపాయి. ఎట్టకేలకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు ఒకే చెప్పడంతో ప్రస్తుతం బాంబుల మోత తగ్గింది. అయితే కాల్పుల విరమణ క్రెడిట్‌ను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi : నెలలోపే ప్రధాని మోదీ రెండో సారి ఒడిశా పర్యటన.. కారణం ఇదే