NTV Telugu Site icon

US: టెక్సాస్‌ హైవేపై కూలిన విమానం.. కార్లు ధ్వంసం.. పలువురికి గాయాలు

Us

Us

అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని విక్టోరియా హైవేపై విమానం కూలిపోయింది. పలు కార్లను ఢీకొట్టి ముక్కలైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు. రోడ్లు మూసివేసి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక విమానంలో ఉన్నవారంతా సేఫ్‌గా ఉన్నట్లు చెప్పారు. అలాగే మూడు కార్లు ధ్వంసం అయినట్లు పేర్కొ్న్నారు. ప్రమాదం కారణంగా.. ఈస్ట్ హై స్కూల్ దగ్గర పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతోనే విమానం టెక్సాస్ హైవేపై కూలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక విమానం శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. ఆస్పత్రికి తరలించిన వారిలో పైలట్ ఉన్నారా? లేదా? అన్నది ఇంకా తెలియలేదని.. దీనిపై ఆరా తీస్తు్న్నట్లు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తు్న్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ప్రమాద సమయంలో పెద్ద శబ్ధం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Pushpa 2: ఇదెక్కడి క్రేజ్ మావా.. రెక్కీ చేసి పుష్ప 2 థియేటర్ దోచేశారు!

Show comments