Site icon NTV Telugu

Boat Capsize: ట్యునీషియా, ఇటలీ మధ్య పడవ బోల్తా.. 37 మంది గల్లంతు..

Boat Capsize

Boat Capsize

Boat Capsize: వలసవాదులతో వెళ్తున్న మరో పడవ బోల్తా పడింది. ట్యూనీషియా, ఇటలీల మధ్య సముద్రంలో పడవబోల్తా పడి 37 మంది గల్లంతయ్యారు. ఓడ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన నలుగురి కథనాన్ని ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) శుక్రవారం తెలిపింది. ఇటలీ ద్వీపం లాంపెడుసా మధ్య వారి పడవబోల్తా పడింది. ప్రాణాలతో బయటపడిన వారంతా ఉప-సహారా ఆఫ్రికాకు చెందిన వారు. వీరంతా గురువారం ఆలస్యంగా లాంపెడుసాకు చేరుకున్నారని, ఓడ ప్రమాదానికి గురైన సమయంలో మరొక నౌక ద్వారా రక్షించబడ్డారని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తెలిపింది.

Read Also: Himanta Biswa Sarma: భారత్ లోనే అనేక మంది “హుస్సేన్ ఒబామాలు”.. వివాదాస్పదమైన సీఎం వ్యాఖ్యలు

బలమైన గాలుల వలన పడవ బోల్తా పడినట్లు పడింది. ఏడుగురు మహిళలు, ఒక బిడ్డతో సహా 37 మంది గల్లంతయ్యారు. సబ్ –
సహారా ప్రాంతం నుంచి వచ్చి, ట్యునీషియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వీరంతా ట్యూనిషీయా నుంచి మధ్యదరా సముద్రం మీదుగా యూరప్ వెళ్తున్నారు. ఆఫ్రికాలో నెలకొన్ని అస్థిర పరిస్థితులు, ఆర్థికమాంద్యంతో ప్రజలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు.

Exit mobile version