Site icon NTV Telugu

Bomb Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్ర దాడి.. 33 మంది మృతి.. 43 మందికి తీవ్రగాయాలు

Afghanistan

Afghanistan

ఆఫ్ఘనిస్తాన్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా ఆ దేశం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. తాజాగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్‌లోని కుందూజ్ ఇమామ్ సాహిబ్ జిల్లాలోని ఓ ప్రార్థనా మందిరంలో శక్తివంతమైన బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా.. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ బాంబు దాడి వెనుక ఐఎస్ఎస్ పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్ పౌర ప్రభుత్వాన్ని గద్దె దింపి తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆ దేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడుతోంది. మైనారిటీలే లక్ష్యంగా ఇప్పటికే పలు దాడులకు పాల్పడింది. ఇన్ని దాడులు జరుగుతున్న తాలిబన్ ప్రభుత్వం ఐఎస్ఎస్‌కు అడ్డుకట్ట వేయలేకపోతోంది. మరోవైపు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. ఇండియా వంటి దేశాలు ఆహార ధాన్యాలను అందిస్తే తప్ప అక్కడి ప్రజల ఆకలి కేకలు తగ్గడం లేదు. మరోవైపు గురువారం మజార్ ఎ షరీఫ్ నగరంలోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడులో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Sri Lanka Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభం.. గ్యాస్‌ ధర రూ.5,500కి పెంపు

Exit mobile version