3 Waves For About 3 Months, Covid Expert On China: కోవిడ్ మహమ్మారికి జన్మస్థానం అయిన చైనా, కోవిడ్ బారిన పడి అల్లాడుతోంది. గతంలో కొన్ని కేసుల సంఖ్య వేలకు చేరేందుకు కొన్ని రోజలు పడితే.. ప్రస్తుతం అక్కడ గంటల్లోనే వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. చైనా వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేయడంతో చైనా వ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా సిబ్బంది కరువయ్యారు. రాబోయే మూడు నెలల్లో చైనా కోవిడ్ తో అతలాకుతలం అయ్యే అవకాశం ఉందని అంటువ్యాధుల నిపుణులు భావిస్తున్నారు.
Read Also: Mansukh Mandaviya: రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోండి..
శీతాకాలం మూడు నెలల్లో చైనా మూడు కోవిడ్ వేవ్ లు అటాక్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం మరణాల సంఖ్యపై అక్కడి ప్రభుత్వం మాత్రం చెప్పడం లేదు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌లోని చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వు జున్యు ప్రకారం.. ప్రస్తుతం శీతాకాలంలో చైనాలో కేసుల సంఖ్య గరిష్టస్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. మూడు నెలల్లో మూడు కోవిడ్ తరంగాలు వస్తాయిన అంచానా వేశారు. వచ్చే ఏడాది జనవరి వరకు ఒక కోవిడ్ వేవ్ ఉంటుందని.. జనవరి 21న చైనా న్యూ ఇయర్ సెలవుకు ముందు దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాకు వెళ్లారని.. ఆ తరువాత మరో వేవ్ రావచ్చని.. ఫిబ్రవరి-మార్చిలో థర్డ్ వేవ్ చైనాపై అటాక్ చేయవచ్చని అంచానా వేశారు.
ప్రస్తుతం చైనా వ్యాప్తంగా కేసులు పెరిగాయి. ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. మందుల డిమాండ్ పెరగడంతో స్టాక్ అయిపోతుందని పాశ్చాత్య మీడియాలు నివేదిస్తున్నాయి. రాబోయే నెలల్లో 10 లక్షల మరణాలు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతీ 10 లక్షల మందికి 684 మరణాలు జరగొచ్చని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ప్రొఫెసర్లు అంచనా వేస్తున్నారు. మొత్తం చైనాలో 140 కోట్ల జనాభా ఉంది. నిపుణుల అంచనా మేరకు 9,64,400 మరణాలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు రాబోయే మూడు నెలల్లో 60 శాతం మంది చైనీయులు కరోనా బారిన పడతారని అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు.
