Site icon NTV Telugu

Paris Shooting: పారిస్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి

Paris

Paris

3 dead after shooting in central Paris, gunman arrested: ఫ్రాన్స్ రాజధాని పారిస్ గన్ కాల్పులతో దద్దరిల్లింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పారిస్ నగరం కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. శుక్రవారం సెంట్రల్ ప్యారిస్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గన్ తో వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

Read Also: Encounter: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు నక్సల్స్ మృతి

నగరంలోని కుర్దిష్ సాంస్కృతిక కేంద్రం పరిసరాల్లో కాల్పుల ఘటన జరిగినట్లు ఫ్రెంచ్ టెలివిజన్ నెట్‌వర్క్ బీఎంఎఫ్ టీవీ నివేదించింది. గన్ ఫైరింగ్ తరువాత భద్రతా బలగాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయని వారికి ధన్యవాదాలు తెలిపారు ఫ్రాన్స్ డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్. పారిస్ పోలీసులు ఘటన జరిగినప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనుమానిత సాయుధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడి వయసు 60 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఏ ఉద్దేశ్యంతో కాల్పులు జరిపాడనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

Exit mobile version