NTV Telugu Site icon

Isreal- Gaza Conflict: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. 27 మంది మృతి

Isral

Isral

Isreal- Gaza Conflict: పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను క్రమంగా పెంచుతుంది. తాజాగా, గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి, ఏడుగురు మహిళలు మరణించారు. ఓ పాఠశాలలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయగా.. దానిని టార్గెట్ గా చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్లతో పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. అందులో తలదాచుకున్న వారి మృతదేహాలు ముక్కలై చిందరవందరగా పడ్డాయి. స్కూల్‌లో ఉగ్రవాదులు ఉండడంతోనే తాము దాడి చేసినట్టు ఇజ్రాయెల్ సైనికులు చెప్తున్నాయి.

Read Also: Viswam Twitter Review: గోపీచంద్ ‘విశ్వం’ ట్విటర్‌ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?

మరోవైపు, లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ దాడులను తీవ్ర తరం చేసింది. తాజాగా జరిపిన దాడిలో తమ సహాయక ప్రతినిధులు ఇద్దరు గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 22 మంది మరణించాగా సుమారు 50 మంది వరకు గాయపడ్డారు. అలాగే, ఇజ్రాయెల్ చేసిన దాడుల నుంచి హిజ్బుల్లా సమన్వయ విభాగానికి అధిపతి అయిన వాఫిక్ సఫా ప్రాణాలతో బయటపడ్డాడు. హిజ్బుల్లాహ్ యొక్క అల్ మనార్ టీవీ హత్యాప్రయత్నం విఫలమైందని ధృవీకరించింది.

Show comments