Heavy snowfall in America : అమెరికాలో మంచు భారీగా కురుస్తుంది. న్యూయార్క్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పెద్దగా మంచు పడుతుంది. పశ్చిమ న్యూయార్క్‌లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిచోట్ల ఆరు అడుగులకుపైగా మంచు పేరుకుపోయింది. చాలా ప్రాంతాల్లో రహదారులన్ని మంచుతో నిండిపోయాయి. గురువారం సాయంత్రం నుంచి మంచు ఏకధాటిగా కురుస్తుంది. దాంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక్కడ ఆరు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రహదారులన్ని మూతపడ్డాయి. దాంతో వాహనాల డ్రైవింగ్‌ను అధికారులు నిషేధించారు. చాలా విమానాలు రద్దయ్యాయి. చాలా ప్రాంతాల్లో కూరుకుపోయిన వాహనాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాకుండా రానున్న 24 గంటల్లో న్యూయార్క్‌లో అత్యధిక హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Read Also: Innovative Protest: మా పెండ్లి ఎప్పుడు సారూ.. అంటూ గుర్రమెక్కిన పెళ్లికాని ప్రసాదులు
దేశవ్యాప్తంగా భారీగా మంచు కురుస్తుండటంతోపాటు ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి పడిపోవడంతో దేశవ్యాప్తంగా 2270కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో గురువారం సాయంత్రం 6 గంటల వరకు (స్థానిక కాలమానం ప్రకారం) 2,270 విమానాలను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ముందస్తుగా శుక్రవారం సుమారు 1,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. శనివారం మరో 85 విమానాలను రద్దు చేశారు. కాగా, గురువారం 7400కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. వాటిలో అత్యధికంగా చికాగో, డెన్వర్ నుంచి వచ్చి, పోయే విమానాలే పావు వంతు ఉన్నాయి. అమెరికాలో ఎక్కువగా ఈ రెండు విమానాశ్రయాల నుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక చికాగోలో మూడు గంటల పాటు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.