Italy: ఊహించని రీతిలో బస్సు వంతెన పై నుండి పడి 21 మంది చనిపోయారు. ఈ దారుణ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. వెనిస్ యొక్క చారిత్రాత్మక కేంద్రం నుండి క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది అని అధికారులు తెలిపారు. బస్సు మీథేన్‌తో నడుస్తుంది. ఈ బస్సును నడుపుతున్న డ్రైవర్ అస్వస్థకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో బస్సు అదుపుతప్పి వంతెన పై నుండి కిందకి పడిపోయింది. ఈ క్రమంలో బస్సు విద్యుత్ లైన్లకు తగలడంతో మంటలు చెలరేగాయని అగ్నిపామక సిబ్బంది తెలిపారు.
Read also:Health Benefits: పెంపుడు జంతువులు మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో తెలుసా..?
ఈ హృదయ విదారక ఘటనలో ఇద్దరు చిన్న పిల్లలతో సహా మొత్తం 21 మంది మరణించారు. అలానే 20 మంది పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పైన స్పందించిన ఇటలీ ప్రధాని తన “ప్రగాఢ సంతాపాన్ని” వ్యక్తం చేశారు. వెనిస్ ప్రాంత గవర్నర్ లూకా జైయా ఈ ఘటన పై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. మృత దేహాలను వెలికితీసి గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితులు మరియు గాయపడిన వారిలో ఇటాలియన్లు మాత్రమే కాకుండా అనేక దేశాల ప్రజలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పైన స్పందించిన మేయర్ లుయిగి బ్రుగ్నారో ఈ సాయంత్రం మా సంఘాన్ని ఒక విషాదం అలుముకుంది అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఆయన ఘటన స్థలాన్ని”అపోకలిప్టిక్ దృశ్యం”గా అభివర్ణించారు.