US: ఫ్లోరిడా యూనివర్సిటీలో కాల్పులు.. ఇద్దరు మృతి
- ఫ్లోరిడా యూనివర్సిటీలో కాల్పులు
- ఇద్దరు మృతి.. మరో ఐదుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఫ్లోరిడా యూనివర్సిటీ రక్తసిక్తమైంది. మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక అప్రమత్తం అయిన పోలీసులు.. నిందితుడిని చాకచాక్యంగా పట్టుకున్నారు.
నిందితుడు ఫీనిక్స్ ఇక్నర్గా గుర్తించారు. స్థానిక డిప్యూటీ షెరీఫ్ కుమారుడిగా పోలీసులు కనుగొన్నారు. షెరీఫ్కు చెందిన ఆయుధంతో కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. భోజన సమయంలో కాల్పులు జరిగాయి. అయితే మరణించిన వారు విద్యార్థులు కాదని సమాచారం. వారి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఇక కాల్పుల ఘటనతో యూనివర్సిటీలో లాక్డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం అన్ని తరగతులను రద్దు చేశారు.
Also Read
- America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
- US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. కాల్పుల గురించి తనకు సమాచారం అందిందని.. ఇది చాలా భయంకరమైన విషయం అని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం యూనివర్సిటీలో 44,000 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు అన్ని రకాలైన తరగతులు రద్దు చేశారు. క్యాంపస్‌లో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
-
Imax in Hyderabad : ‘AMB ఐమాక్స్’.. మహేష్ బాబు, వెంకటేష్ లీగ్ కాంబోలో క్రేజీ మల్టీప్లెక్స్
-
lizards: ఇంట్లో బల్లుల బెడదా? పైసా ఖర్చు లేకుండా శాశ్వతంగా తరిమికొట్టేందుకు అద్భుతమైన చిట్కాలు ఇవే!
-
Virat Kohli Video: విన్నింగ్ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ వింత సెలబ్రేషన్.. ఆ సైగకు అర్థం ఏమిటి..? వీడియో వైరల్..
-
Virat Kohli Next Match: RCBకి ఐపీఎల్ 2026 టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ.. మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడు..?
-
TGPSC Notifications: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!