NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబుదాడి.. పెషావర్‌లో ఘటన..

Pakistan

Pakistan

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో కనీసం ఇద్దరు మరణించినట్లుగా అదికారులు వెల్లడించారు. పెషావర్‌లోని బోర్డ్ జబార్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Read Also: Turtle meat: సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మృతి.. 78 మందికి తీవ్ర అస్వస్థత..

మోటార్ సైకిల్‌పై పేలుడు పదార్థాలు అమర్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు జరిగిన తీరును గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడులో అనుమానిత బాంబర్ కూడా చనిపోయాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పెషావర్ పోలీస్ చీఫ్ కాషిఫ్ అబ్బాసీ తెలిపారు. అయితే, ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా బాధ్యత వహించలేదు. ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ పేలుడు ఘటనను ఖండించారు. పోలీసుల నుంచి నివేదిక కోరారు.

ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం పాకిస్తాన్ తాలిబాన్లకు కేంద్రంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడి గిరిజన ప్రాంతాల్లో తాలిబాన్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. పాక్ పోలీసులు, ఆర్మీ లక్ష్యంగా తాలిబాన్లు, ఇతర ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడుతున్నాయి.