Site icon NTV Telugu

Hamas-Israel war: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. చిన్నారుల సహా 16 మంది మృతి

Hamasisrael War

Hamasisrael War

గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత తొమ్మిది నెలలుగా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గత అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా.. ఇజ్రాయెల్‌‌పై దాడి చేసింది. ప్రతీకారంగా ఆరోజు నుంచి ఇజ్రాయెల్.. హమాస్ లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా చిన్నారుల సహా 16 మంది చనిపోయారని గాజా వైద్యులు సోమవారం తెలిపారు. ఖాన్ యూనిస్ సమీపంలో ఇజ్రాయెల్ ట్యాంక్ షెల్లింగ్, వైమానిక దాడుల్లో కనీసం 16 మంది పాలస్తీనియన్లు మరణించారని డాక్టర్లు పేర్కొన్నారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారని, దాడిలో డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ కొన్ని పరిసరాలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. ఆ ప్రాంతాలపై తిరిగి దాడులు కొనసాగిస్తోంది.

ఇది కూడా చదవండి: Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ నా ఫ్రెండ్.. ఆవేశంతో ఊగిపోయిన RJ శేఖర్ భాషా

తమను ఎవరు ఖాళీ చేయమని చెప్పలేదని ఖాన్ యూనిస్‌ వాసులు వాపోయారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాకుండానే ఖాన్ యూనిస్‌పై దాడులు జరిగాయని ప్రజలు పేర్కొన్నారు. తాము ఇక అలసిపోయామని జనాలు వాపోయారు. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగానే పిల్లలతో కలిసి గాడిద బండ్లపై, మరికొందరు కాలినడకన వస్తువులు తీసుకుని పారిపోయారు. ఇక ఈ బాధలు భరించలేమని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: Loan App harassment: లోన్‌యాప్‌ వేధింపులు.. సచివాలయం ఉద్యోగి అదృశ్యం..

Exit mobile version