Israel Iran Conflict: ఇరాన్ పై మరోసారి విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. టెహ్రాన్ లోని ఆరు ఇరానియన్ సైనిక విమానాశ్రయాలను దాడి చేయగా.. అందులో ఉన్న 15 ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్‌లు పూర్తిగా ధ్వంసం అయినట్లు పేర్కొన్నాయి. ఇరాన్ భూభాగంపై తమ విమానాలు దాడులు చేయకుండా అడ్డుకోవడంతోనే తమ సైన్యం ఆ జెట్‌లను నాశనం చేసిందని ఐడీఎఫ్ తెలిపింది.
Read Also: Mega Star : ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు
అయితే, ఇరాన్‌లోని కెర్మాన్‌షా ప్రాంతంలోని మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నుంచి ఇజ్రాయెల్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఉపరితలం నుంచి క్షిపణులతో దాడులు చేసేందుకు ప్లాన్ చేయడంతోనే తాము ఆ 6 విమానాశ్రయాలను నాశనం చేశామని ఐడిఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ దేశ భద్రతను కాపాడుకోవడానికి వైమానిక దాడులతో పాటు అనేక మార్గాల్లో టెహ్రాన్ పై యుద్ధం కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. ఇక, ఆదివారం ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిన తర్వాత, టెల్ అవీవ్, హైఫా వంటి ప్రధాన ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడి చేసిన ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది.
