Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి.. సంఖ్య పెరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ ఆఫ్ఘన్‌లోని హెరాత్ ప్రావిన్సులో శనివారం 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ధాటికి ఇప్పటి వరకు 14 మంది మరణించగా.. 78 మంది గాయపడ్డారు. చాలా భవనాలు కూలిపోయాయి. కూలిన భవనాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం ఈ ప్రాంతంలోని అతిపెద్ద నగరమైన హెరాత్‌కి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. రిక్టర్ స్కేలుపై 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో ఐదు భూకంపాలు వచ్చినట్లు తెలిపింది. సుమారుగా ఉదయం 11 గంటలకు భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడటం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతినిధి ముల్లా జాన్‌సయేక్ తెలిపారు.
Also Read
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
- Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
- China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
- Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
Read Also: Israel: ఇజ్రాయిల్‌కి అండగా ఉంటామన్న ప్రధాని మోడీ.. ప్రపంచ నేతల మద్దతు..
గంట పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. హెరాత్ పట్టణంలోని విధుల్లోకి మహిళలు, పిల్లలు వచ్చారు. ప్రాథమిక సమచారం ప్రకారం వందల మంది ఈ భూకంపంలో చనిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌లొ 5.9 తీవ్రతలో భూకంపం వచ్చింది. దీనివల్ల 1000కి పైగా మంది చనిపోయారు. పదివేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది మార్చిలో ఈశాన్య ఆఫ్ఘానిస్తాన్ లో జుర్మ్ సమీపంలో 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీనివల్ల పాక్-ఆఫ్ఘన్లలో 13 మంది మరణించారు.
ఆఫ్ఘన్ తరుచుగా భూకంపాల బారిన పడుతోంది. హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భూమి అడుగున యురేషియన్ టెక్టానిక్ ప్లేట్, ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ల జంక్షన్ ఉంది. దీంతో ఈ రెండు పలకలు రాపిడి వల్ల భూకంపాలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
-
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
-
Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
-
Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!