NTV Telugu Site icon

Turkey: ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 12 మంది మృతి

Turkey

Turkey

టర్కీలోని ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. బాలికేసిర్ ప్రావిన్స్‌లో ఉన్న క్యాప్సూల్ ఉత్పత్తి కేంద్రంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా తెలిపింది. పేలుడు ధాటికి భవనం కూలిపోయింది. అంతేకాకుండా చుట్టుపక్కల భవనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఎవరూ లేరని, మంటలు ఆర్పివేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Allu Arjun: చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ విచారణ పూర్తి

ప్రమాదం తర్వాత ప్లాంట్ చుట్టూ గాజు మరియు మెటల్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షతగాత్రులు భగవంతుని దయతో త్వరగా కోలుకోవాలని స్థానిక గవర్నర్ ఇస్మాయిల్ ఉస్తావోగ్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్లు ఇంటీరియర్‌ మంత్రి వెల్లడించించారు. ప్రమాదానికి గల కారణాలను వెంటనే చెప్పలేమన్నారు. ప్రమాదం జరిగిన వేళ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: America: దత్తపుత్రులపై అత్యాచారానికి పాల్పడిన స్వలింగ సంపర్కుల జంట.. వందేళ్ల జైలు శిక్ష

ప్రమాదం పట్ల టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘12 మంది సోదరుల మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను. సంబంధిత సంస్థల ద్వారా తనకు సమాచారం అందించామని, వెంటనే సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించామని’’ ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం 8:25 గంటలకు పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ప్లాంట్‌లోని కొంత భాగం కూలిపోయింది. పేలుడుకు కారణం ఇంకా అస్పష్టంగా ఉందని అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Allu Arjun Bouncer Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందుతుడు అరెస్ట్!