NTV Telugu Site icon

తాలిబన్ల చెరలో వెయ్యిమంది భారతీయులు..!

afghanistan

afghanistan

తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత.. అక్కడి భారత రాయభార కార్యాలయంలోని మొత్తం సిబ్బందిని భారత్‌కు తరలించారు అధికారులు.. అయితే, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది… సుమారు 1000 మంది భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.. వారిలో సుమారు 200 మంది సిక్కులు, హిందువులు స్థానిక గురుద్వారలో తలదాచుకున్నట్లు సమాచారం. ఆప్ఘన్ లో ఉన్న భారతీయులతో సహా, తాలిబాన్ల చేతిలో బందీలుగా ఉన్న సుమారు 150 మంది భారతీయులను భారత్ కు తరలించేందుకు, ఇతర మార్గాల ద్వారా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు భారత విదేశాంగశాఖ ఉన్నతాధికారులు. ప్రస్తుతానికి తాలిబాన్ల వద్ద బందీలుగా ఉన్న భారతీయులకు ఏలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు.

తాలిబాన్ల బందీలో ఉన్న భారతీయులు సురక్షితంగా ఉన్నారని.. సాధ్యమైనంత త్వరలో భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెబుతున్నారు.. ఇప్పటికే కాబూల్ విమానాశ్రయం లో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంది.. కాబూల్ విమానాశ్రయం వద్ద సుమారు 150 మంది భారతీయతలను బందీలుగా చేసిన తాలిబాన్లు.. విమానాశ్రయం నుంచి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు ట్రక్కులలో తరలించినట్టుగా సమాచారం.. భారతీయులకు సంబంధించిన ప్రయాణ పత్రాలు, గుర్తింపు కార్డులను పరిశీలించినట్టుగా తెలుస్తోంది.. ఇంకా సుమారు 1000 మంది ఆప్ఘనిస్తాన్ లో భారతీయులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.. అయితే, చాలామంది భారత దౌత్యకార్యలయం వద్ద తమ పేర్లను నమోదు చేసుకోని భారతీయులు కూడా వీరిలో ఉన్నారు.. ఏఏ ప్రాంతాలలో ఉంటున్నారో, ఆయా ప్రాంతాలు సురిక్షితమే నా లేదా అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడిపోయారు అధికారులు.