Site icon NTV Telugu

Israel:100 మంది ఇజ్రాయిల్ పౌరులు, సైనికులను కిడ్నాప్ చేసిన హమాస్.

Israel Kidnapping Incidents

Israel Kidnapping Incidents

Israel: ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన భీకరదాడిలో ఇప్పటి వరకు 300కు పైగా మంది మరణించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి వచ్చిన ఉగ్రవాదులు పలువురు ఇజ్రాయిల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేశారు. ఇందులో కొందర్ని చంపిన వీడియోలు బయటకు వస్తున్నాయి. హమాస్ ఉగ్రదాడిలో కనీసం 100 మంది ఇజ్రాయిల్ పౌరులను, సైనికులను బందీలుగా చేసుకున్నట్లు అమెరికాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.

Read Also: Hamas Attack On Isreal: “నన్ను చంపొద్దు”.. ఉగ్రవాదుల్ని వేడుకున్న ఇజ్రాయిల్ యువతి.. వీడియో వైరల్..

300 మంది హత్య చేయబడ్డారు, 5000 కంటే ఎక్కువగా రాకెట్లను ఫైర్ చేశారిన రాయబార కార్యాలయం తెలిపింది. హమాస్ గ్రూప్ చేసిన ఆకస్మిక ఉగ్రదాడి జరిగిన మొదటి గంటలోనే ఎక్కువ భాగం కిడ్నాప్ మరియు బందీలు జరిగాయి. ఇజ్రాయిల్ కి రక్షణగా ఉంచిన కంచెను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఇంజిన్లతో పనిచేసే పారాగ్లైడర్లతో రక్షణ ఉన్న కంచెను దాటుకుని ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడ్డారు.

Exit mobile version