ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయింది. అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తమ చేతుల్లో తీసుకుని పాలించడం మొదలుపెట్టారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో అఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా మహిళల హక్కులను తాలిబన్లు హరించివేస్తున్నారనే అపవాదు వచ్చింది. మీడియాపైనా తాలిబన్లు పలు రకాల ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పలువురు పౌరులు దేశాన్ని విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మరికొందరు ఏ దిక్కు లేక అక్కడే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
Read Also: ఇంజనీర్ అవినీతి భాగోతం… పైప్‌లైన్ తెరిస్తే నోట్ల కట్టలు బయటపడ్డాయి
తాలిబన్‌ల అరాచకాలతో ఇప్పటివరకు 150 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ల 100 రోజుల పాలనలో 50 శాతం మంది (23 మిలియన్‌లు) దేశప్రజలు తినడానికి సరైన తిండి లేక ఉపవాసం ఉంటున్నారు. దీంతో ఆ దేశంలో ఆకలి చావులు నానాటికీ పెరిగిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా తాలిబన్‌లను ప్రజాస్వామ్య దేశాలు గుర్తించడం లేదు.