NTV Telugu Site icon

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్.. 10 మంది శ్రీలంక క్రీడాకారుల మిస్సింగ్‌..

Sri Lankan

Sri Lankan

కామన్వెల్త్ గేమ్స్ నుండి 10 మంది శ్రీలంక క్రడీకారులు అదృశ్యమయ్యారని అధికారులు ప్రకటించారు.. తొమ్మిది మంది శ్రీలంక అథ్లెట్లు మరియు మేనేజర్ తమ ఈవెంట్‌లను పూర్తి చేసిన తర్వాత అదృశ్యం కావడం కామన్తెల్త్ గేమ్స్‌లో కలకలం సృష్టిస్తోంది.. అయితే, సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కామన్వెల్త్ క్రీడల బృందంలోని పది మంది సభ్యులు బ్రిటన్‌లో ఉండేందుకు అనుమానాస్పద ప్రయత్నంలో అదృశ్యమయ్యారని ద్వీప దేశానికి చెందిన ఒక ఉన్నత క్రీడా అధికారి అనుమానం వ్యక్తం చేశారు.. మొదట జూడోకా చమీలా దిలానీ, ఆమె మేనేజర్ అసేలా డి సిల్వా మరియు రెజ్లర్ షానిత్ చతురంగ గత వారం అదృశ్యమయ్యారు. దీంతో శ్రీలంక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరో ఏడుగురు అదృశ్యమయ్యారు.. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు 160 మందితో కూడిన శ్రీలంక క్రీడాకారుల బృందం బర్మింగ్‌హామ్ చేరుకోగా.. ఈవెంట్లు ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: IND vs WI: వెస్టిండీస్‌పై గ్రాండ్‌ విక్టరీ.. భారత్‌ ఖాతాలో మరో సిరీస్‌..

ఇక, మొదట అదృశ్యమైన ముగ్గురిని బ్రిటీష్ పోలీసులు గుర్తించారు, అయితే వారు స్థానిక చట్టాలను ఉల్లంఘించినా.. ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే వీసాలను కలిగి ఉన్నందున, ఎటువంటి చర్య తీసుకోలేదని శ్రీలంక అధికారి వెల్లడించారు.. గతంలోనూ అంతర్జాతీయ ఈవెంట్ల నుంచి శ్రీలంక అథ్లెట్లు తప్పిపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబరులో, శ్రీలంక రెజ్లింగ్ మేనేజర్ తన జట్టును విడిచిపెట్టి ఓస్లోలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ సందర్భంగా అదృశ్యమయ్యాడు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా ఇద్దరు శ్రీలంక అథ్లెట్ల ఆచూకీ లభించలేదు. ఇప్పుడు మరో 10 మంది తప్పిపోగా.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురుని గుర్తించగా.. మరో ఏడుగురి కోసం ప్రత్యేక బృందాలను ఏ ర్పాటు చేశారు.