NTV Telugu Site icon

UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర

Upi Transactions

Upi Transactions

UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర నమోదైంది. 2022 జూలైలో 6 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్‌ జరిగాయి. ఈ వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) వెల్లడించింది. 2016 తర్వాత అంటే గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. యూపీఐ ట్రాన్సాక్షన్లు 2019 అక్టోబర్‌లో తొలిసారి 1 బిలియన్‌ మార్క్‌ను దాటాయి. మొదటి మూడేళ్లలో కేవలం ఒక బిలియన్‌ లావాదేవీలే జరగ్గా తర్వాతి మూడేళ్లలో ఏకంగా 5 బిలియన్లు దాటడం గమనార్హం. మన దేశంలో డిజిటల్‌ పేమెంట్ల సంఖ్య శరవేగంగా వృద్ధి చెందుతోంది అనటానికి ఇది తాజా ఉదాహరణ అని చెప్పొచ్చు.

మన కన్నా అమెరికాలోనే ఎక్కువ

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా కన్నా మన దేశమే బెటర్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాది జులై చివరికి యూఎస్‌లో 32 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపగా ఇండియాలో 11 వేల మందికి పైగా ఉద్వాసన పలికారు. అమెరికాతో పోల్చితే ఇది చాలా తక్కువ. యూఎస్‌లోని స్టార్టప్స్‌, పబ్లిక్‌ ట్రేడింగ్‌ కంపెనీలతోపాటు మైక్రోసాఫ్ట్‌, మెటా(ఫేస్‌బుక్‌)లూ ఇదే బాట పట్టాయి. స్టాఫ్‌ తొలగింపునకు సంబంధించిన ఈ డేటాను ‘క్రంచ్‌బేస్‌’ అనే సంస్థ వెల్లడించింది.

GST revenue collections: జీఎస్టీ చరిత్రలో రెండో అత్యధిక వసూళ్ల రికార్డ్‌

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

ఈవారం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 359 పాయింట్లు పెరిగి 57,929.39 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీలో 17,256 పాయింట్లకు పైనే ట్రేడింగ్‌ జరుగుతోంది. ఎం &ఎం షేర్‌ విలువ గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్‌ స్థాయిలో పెరిగింది. త్వరలోనే రూ.1500కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రిలయెన్స్‌, మారుతీ, పవర్‌ గ్రిడ్‌, టాటా స్టీల్‌ తదితర సంస్థలకు లాభాలు వచ్చాయి. జేకే పేపర్‌ 10%, ఆంధ్రా పేపర్‌ 16% ప్రాఫిట్స్‌ నమోదు చేశాయి. నిఫ్టీలో మిడ్‌ క్యాప్‌ 100, స్మాల్‌ క్యాప్‌ 100 విలువ 0.5% పెరిగింది. యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, సన్ ఫార్మాల వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.