Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. ఇప్పుడు చాలా మంది కన్ను దేశంలోని అప్పులపై పడింది. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రుణాలపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026–27లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రూ.17.2 లక్షల కోట్ల ($187.63 బిలియన్లు) రుణం తీసుకోనున్నట్లు ప్రతిపాదించారు. ఇది మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది.
READ MORE: Union Budget 2026-27: ఏ రంగానికి ఎంత? రవాణా, రక్షణ రంగాలకు పెద్దపీట!
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్లో కీలక మార్పులు
- Budget 2026: గ్లోబల్ అనిశ్చితుల్లో భారత్ బడ్జెట్‌పై అంచనాలు.. కీలక రంగాల్లో సంస్కరణలు
అయితే నికరంగా చూస్తే మార్కెట్ నుంచి ప్రభుత్వం తీసుకునే రుణం రూ.11.70 లక్షల కోట్లుగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇది గత 2025–26 ఆర్థిక ఏడాదితో పోలిస్తే కొద్దిగా తక్కువ. అయినా మొత్తం రుణాల పరిమాణం పెద్దగా ఉండటంతో బాండ్ మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొన్ని నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడంతో ప్రభుత్వ బాండ్లపై డిమాండ్ కంటే సరఫరా ఎక్కువైంది. దీని ప్రభావంతో బాండ్ యీల్డ్స్ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వడ్డీ రేట్లను మొత్తం 1.25 శాతం తగ్గించినప్పటికీ, 10 ఏళ్ల గడువు ఉన్న ప్రభుత్వ బాండ్ యీల్డ్ గత ఏడాది ఫిబ్రవరి కంటే ఇప్పటికీ కొద్దిగా ఎక్కువగానే ఉంది. బడ్జెట్‌కు ముందు మార్కెట్ నిపుణులు మొత్తం రుణాలు రూ.16 లక్షల కోట్ల నుంచి రూ.17.5 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేశారు.
READ MORE: Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..
ఇదిలా ఉండగా, ప్రభుత్వం తన ఆర్థిక విధానంలో కొత్త దృష్టికోణాన్ని తీసుకొచ్చింది. ఇకపై రుణాలు–జీడీపీ నిష్పత్తిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆర్థిక క్రమశిక్షణ పాటించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ నిష్పత్తిని 55.6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఆర్థిక లోటును జీడీపీలో 4.3 శాతంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక లోటు అంటే ప్రభుత్వ ఖర్చులు, ఆదాయాల మధ్య తేడా. ఇది ఎంత ఉంటుందన్నదానిపై ప్రభుత్వ రుణాల అవసరం, మొత్తం అప్పుల స్థాయి, మార్కెట్ నమ్మకం అన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ సంఖ్యలను పెట్టుబడిదారులు, ఆర్థిక వర్గాలు చాలా జాగ్రత్తగా గమనిస్తుంటాయి. మొత్తంగా చూస్తే, భారీ రుణాల ప్రకటన ఒకవైపు ఆర్థిక మార్కెట్లలో ఉత్కంఠను పెంచగా, మరోవైపు దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం ఇచ్చిన హామీ కొంత భరోసానూ ఇస్తోంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!