ముంబైకి చెందిన శ్రీ రిఫ్రిజిరేషన్స్ మెటీరియల్ ఆర్గనైజేషన్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ నుంచి కొత్త ఆర్డర్లను అందుకుంది. ప్రాజెక్ట్ లో 4.12 కోట్ల మాగ్నెటిక్ బేరింగ్ కంప్రెసర్ AC ప్లాంట్, 19.62 కోట్ల కోస్ట్ గార్డ్ షిప్‌ల కోసం టర్న్‌కీ HVAC సిస్టమ్ ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన శ్రీ రిఫ్రిజిరేషన్స్ మెటీరియల్ ఆర్గనైజేషన్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ నుంచి కొత్త ఆర్డర్లను పొందినట్లు సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్రాజెక్టులలో భాగంగా 4.12 కోట్ల రూపాయల విలువైన బేరింగ్ కంప్రెసర్ ఏసీ ప్లాంట్, 19.62 కోట్ల విలువైన కోస్ట్ గార్డ్ షిప్ ల కోసం టర్న్ కి HVAC సిస్టమ్ ఉన్నాయని వారు వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్ట్ లు సెప్టెంబర్ 2029 పూర్తి అవుతాయని.. ఇది భారత దేశ రక్షణ రంగంలో తన ఉనికిని బలోపేతం చేస్తుందని యాజమాన్యం పేర్కోంది.