NTV Telugu Site icon

India’s Forex Reserves: మళ్లీ తగ్గిన భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు

India's Forex Reserves

India's Forex Reserves

భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, ఈ నెల 9వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 593.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీనికి ముందు వారంలో విదేశి నిల్వలు భారీగా పెరిగాయి. 2023 మే 26వ తేదీన నమోదైన 589.13 బిలియన్ డాలర్ల కంటే.. 2023 జూన్ 2తేదీ నాటికి 5.92 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి, 595.06 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Also Read: PM Modi America Visit: అమెరికాలో ప్రధాని మోడీ పేరుతో కారు నంబర్ ప్లేట్

మన దేశంలో ఫారిన్‌ కరెన్సీ నిల్వలు ఇప్పటికీ వాటి చారిత్రక గరిష్ఠ స్థాయి కంటే దాదాపు 52 బిలియన్ డాలర్లు తక్కువలో ఉన్నాయి. అయితే, ఈ అంతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంటే, భారత విదేశీ వాణిజ్యం పెరుగుతోంది. RBI డేటా ప్రకారం, జూన్‌ 9తేదీ నాటికి మన దేశంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.12 బిలియన్‌ డాలర్ల క్షీణతతో 525.07 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. జూన్ 2తో ముగిసిన వారంలో ఇవి 526.20 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో అమ్ముడు పోని ఇళ్లు.. కారణం ఏంటో తెలుసా..?

దేశంలో బంగారం నిల్వలు కూడా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తుంది. IMF వద్ద ఉన్న ఇండియా గోల్డ్‌ రిజర్వ్స్‌ 8 మిలియన్ డాలర్లు తగ్గి 5.11 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. అయితే గత వారంలో అవి 5.12 బిలియన్‌ డాలర్లు ఉండగా.. శుక్రవారం (జూన్ 16, 2023), అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడింది. డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్‌ వాల్యూ 25 పైసలు మెరుగుపడి రూ. 81.94 వద్ద ముగిసింది.

Also Read: Prabhas: పాన్ ఇండియా రూలర్!

భారతదేశ ఫారిన్‌ కరెన్సీ నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో 645 బిలియన్ డాలర్లతో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌.. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. దీంతో భారీగా విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వచ్చాయి.