Gold and Silver Prices: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. ఈ రోజు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్ప ఒడిదుడుకులతో కొనసాగుతున్నాయి. గత సెషన్‌లో భారీగా పతనమైన అనంతరం ఉదయం ట్రేడింగ్‌లో ధరలు కొంత స్థిరంగా కనిపించాయి. అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధానాన్ని కొనసాగించవచ్చనే అంచనాలు పసిడి, వెండి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఓ దశలో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి..
ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,570 పడిపోవడంతో.. రూ.1,30,690కి పరిమితమైంది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,350 తగ్గడంతో.. రూ.1,19,800కి పడిపోయింది.. ఇక, కిలో వెండి ధర ఏకంగా మరోసారి రూ.5 వేలు తగ్గడంతో కిలో వెండి ధర రూ.1,80,000కి దిగివచ్చింది.. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో భారీ కరెక్షన్ నమోదైంది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య విధానంపై పెట్టుబడిదారుల అంచనాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 4 గడువు గల బంగారం ఫ్యూచర్స్ ధర బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 3.24 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,29,880కి చేరింది. వెండి ఫ్యూచర్స్ ధర 5.26 శాతం పడిపోయి కిలోకు రూ.1,60,775గా నమోదైంది. ఇక ఇతర MCX స్పాట్ బెంచ్‌మార్క్ ధరల ప్రకారం బంగారం 10 గ్రాములకు రూ.1,30,921గా, వెండి కిలోకు రూ.1,69,016గా ఉంది. అమెరికా డాలర్ బలోపేతం, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, వడ్డీ రేట్లపై అంచనాలు బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

