NTV Telugu Site icon

వినియోగ‌దారుల‌కు షాకింగ్ న్యూస్‌: భారీగా పెరిగిన పుత్త‌డి ధ‌ర‌లు…

బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  కొన్న రోజుల క్రితం వ‌ర‌కూ తగ్గుతూ వ‌చ్చి ప‌సిడి ప్రేమికుల‌కు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఆ ధ‌ర‌లు క్ర‌మంగా పైపైకి క‌దులుతున్నాయి.  దీంతో బంగారం కొనుగోలు చేయాల‌ని అనుకునే వారు ఇబ్బందులు ప‌డుతున్నారు. తాజాగా ఈరోజు కూడా బంగారం ధ‌ర‌లు పెరిగాయి.  పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ.45,250కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.280 పెరిగి రూ.49,370కి చేరింది.  బంగారం ధ‌ర‌లు పైపైకి క‌దిలితే, వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా ప‌త‌నం అవుతున్నాయి.  కిలో వెండి ధ‌ర రూ.600 వ‌ర‌కు తగ్గి రూ. 72,300కి చేరింది.  మార్కెట్లు పుంజుకోవ‌డంతో ధ‌ర‌లు పెరిగిన‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  

Read: “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కోసం స్పెషల్ డైరెక్టర్ ?