Site icon NTV Telugu

Gold Price Today: బ్యాడ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధర

Gold

Gold

వరుసగా రెండు రోజులు దిగివచ్చి కొనుగోలు దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన పసిడి ధరలు.. ఇప్పుడు షాక్‌ ఇచ్చాయి.. మరోసారి పైకి కదిలాయి.. దేశంలోని చాలా నగరాల్లో బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈరోజు భారత మార్కెట్‌లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4810 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48100గా ఉంది.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్లు మరియు 24 క్యారెట్ల బంగారం ఈరోజు వరుసగా రూ. 46290 మరియు రూ. 50500గా ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల మరియు 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.48100 మరియు రూ.49100గా ఉండగా.. ఢిల్లీలో 22 క్యారెట్లు మరియు 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 మరియు రూ.52530గా ఉంది. అదే సమయంలో, కోల్‌కతాలో ఈరోజు 22 క్యారెట్ల మరియు 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.48500 మరియు రూ.51200గా ఉన్నాయి.

Read Also: Aadhaar: పుట్టగానే ఆధార్‌ నంబర్‌.. ఆస్పత్రిలోనే కేటాయింపు..!

ఇక, హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరలు పెరిగాయి.. 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.47,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.400 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక్కగ్రాము బంగారం ధరల రూ.4,755కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాము బంగారం ధర రూ.51,870గాకు చేరింది.. గురువారంతో పోలిస్తే.. ఇవాళ రూ.430 పెరిగింది. హైదరాబాద్‌లో గ్రాము స్వచ్ఛమైన బంగారం ధర రూ.5,187కి ఎగబాకింది. మరోవైపు.. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000గా ఉంది. గురువారం, శుక్రవారానికి వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు..

Exit mobile version