జూన్ 18, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: ఈ రాశివారిలో ఉన్న అనవసరమైన భయాందోళనలు ఇవాళ తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు తప్పేలా లేవు.. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి.
వృషభం: ఈ రాశివారు ఈ రోజు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది..
Also Read
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
మిథునం: ఈ రాశివారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలున్నాయి.. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.. వృథా ప్రయాణాలు చేస్తారు.
కర్కాటకం: ఈ రాశివారి రుణప్రయత్నాలు ఇవాళ ఫలిస్తాయి.. చెడు సహవాసంవైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది.
సింహం: ఈ రాశివారు ఇవాళ బంధు, మిత్రులను కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి.
కన్య: ఈ రాశివారు ఇవాళ సంతోషంగా గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
తుల: ఈ రాశివారి మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.
వృశ్చికం: ఈ రాశివారికి కుటుంబ పరిస్థితులు ఈరోజు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది.
ధనుస్సు: ఈ రాశివారు తమ బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం ఎంతో మేలు చేస్తుంది.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు తప్పేలా లేవు.. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది.
మకరం: ఈ రాశివారు ఈ రోజు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది.
కుంభం: ఈ రాశివారు ఈ రోజు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు.. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి.
మీనం: ఈ రాశివారు ఈ రోజు తమకు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం ఎంతో శ్రేయస్కరం.. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.
తాజావార్తలు
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!