మే 23, ఆదివారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : మీ రాశి స్వామి అంగారకుడు పాపగ్రహాల సాంగత్యంతో ఉండటం వల్ల మీకు ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. సంతానం వైపు నుంచి నిరాశ పరిచే వార్తలను వింటారు. సాయంత్రం ఆగిపోయిన పనులు, వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. రాత్రి సమయంలో మీకిష్టమైన వారిని కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఫలితంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
వృషభం : ఈ రోజు వృషభ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత పొందుతారు. రాజకీయ రంగంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పాలన, అధికారం ద్వారా ప్రయోజనాలు అందుకుంటారు. ఒప్పందాల ద్వారా మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. రాత్రి సమయంలో ఇష్టం లేని వ్యక్తులను కలుస్తారు. ఫలితంగా వారితో వాదనలు ఉండవచ్చు. పిల్లల వైపు నుంచి శుభకరమైన వార్తలు వింటారు.
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
మిథునం : మిథున రాశి వారు ఈ రోజు విలువైనదాన్ని కోల్పోయే ప్రమాదముంది. పిల్లలు చదువుపై దృష్టి పెట్టి, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం మీ మనస్సుకు ఆనందంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. రాత్రి సమయంలో మీకిష్టమైనవారిని కలుసుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
కర్కాటకం : చంద్రుడు మీ రాశిలో మూడో పాదంలో ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రతిష్ఠ పెరుగుతుంది పిల్లల బాధ్యత నెరవేర్చవచ్చు. ప్రయాణంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు మీకిష్టమైన వ్యక్తులను కలిసే అవకాశముంది. ఈ రోజు మీరు ఏదైనా శుభవార్తలు వినే అవకాశముంది.
సింహం : సూర్యుడు అధిపతి అయిన సింహ రాశి వారు ఈ రోజు నూతన ఆదాయ వనరులు అందుకుంటారు. అంతేకాకుండా మీ మాటల మాదుర్యంతో గౌరవం అందుకుంటారు. పోటీ పరీక్షల్లో ప్రత్యేక విజయాలు అందుకుంటారు. కొంతమందికి ఇది అసౌకర్యగా అనిపించవచ్చు. నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో శత్రువులు నాశనం అవుతారు.
కన్య : కన్యా రాశి వారికి ఈ రోజు బుధుడు ఆనందాన్ని పెంచుతాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న ప్రయత్నాల్లో అనూహ్య విజయాన్ని అందుకుంటారు. పిల్లల వైపు నుంచి సంతృప్తికరమైన వార్తలు పొందుతారుు. మధ్యాహ్నం చట్టపరమైన వివాదాల్లో లేదా దావాల్లో విజయం సాధిస్తారు. ఇది మీ ఆనందానికి కారణం అవుతుంది. శుభకరమైన ఖర్చులు ఉండవచ్చు. ఇది మీ కీర్తిని పెంచుతుంది.
తుల : ఈ రోజు తులా రాశి వారికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. చాలా రోజులుగా కొనసాగుతున్న లావాదేవీలు ఈ రోజు పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. ప్రయాణాలను కొన్ని కారణాల వల్ల వాయిదాలు వేసుకుంటారు. ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం మీకు కలిసి వస్తుంది.
వృశ్చికం : ఈ రోజు మీ రాశిలోని సప్తమి, అష్టమి పాదాల్లో త్రిగ్రహయోగం సంభవించనుంది. కొన్ని రోజుల పాటు ఈ యోగం కొనసాగనుంది. కొన్ని అంతర్గత రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. శరీరానికి కొంత విశ్రాంతి అవసరం. పనిలో అంతగా ఆసక్తి చూపించరు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
ధనస్సు : ఈ రోజు శత్రువులు మీ చేతుల్లో ఓడిపోతారు. అధికార పక్షంతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అత్తగారి వైపు నుంచి ప్రయోజనం అందుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
మకరం : ఈ రోజు కుటుంబ, ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. సహోద్యోగుల నుంచి గౌరవ, మర్యాదలు అందుకుంటారు. సాయంత్రం సమయంలో ఏదైనా గొడవల్లో చిక్కుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి.
కుంభం : ఈ రోజు మీ ఆరోగ్యం క్షీణించే అవకాశముంది. వాదనలు, వివాదాల్లో చిక్కుకోపోతే మంచిది. ప్రత్యర్థులు ఇబ్బంది కలిగించవచ్చు. కొన్ని ప్రతికూల వార్తలు కారణంగా మీరు అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆగిపోయిన పనులు, అసంపూర్తిగా ఉన్న వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. ప్రేమ జీవితంలో సామరస్యం ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది.
మీనం : ఈ రోజు మీరు కుమారుడు లేదా కుమార్తే విషయంలో ఆందోళన చెందుతారు. దాంపత్య జీవితంలో చాలా రోజుల ప్రతిష్ఠంభన ముగుస్తుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఖర్చు చేస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బృహస్పతి త్రికోణ యోగం కారణంగా విలువైన వస్తువును కోల్పోయే అవకాశముంది. కాబట్టి వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండండి.
- Tags
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!