జులై 29 గురువారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈరోజు ఈ రాశివారికి వారికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల ఆరోగ్యం నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.
వృషభం : ఈ రోజు మీరు సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి వంటివి అధికం. ఉద్యోగస్తులు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
మిథునం : ఈ రోజు ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కొత్త ప్రదేశంలో ఆహారం, నీరు మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు బంధువుల కోసం వారి కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారిక మార్పులు అనుకూలిస్తాయి.
సింహం : ఈ రోజు మీరు ఎదుటివారిని వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. స్వర్ణకారులు, వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ మంచి కోరుకునే వారు కంటే మీ చెడును కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
కన్య : ఈ రోజు వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంటకనిపెట్టుకుని ఉండటం మంచిది. కొబ్బరి, పండ్లు, పూల కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం.
తుల : ఈ రోజు ఈరాశిలోని వైద్యులకు ఆపరేషన్లు చేసే సమయంలో ఏకాగ్రత, మెళకువ అవసరం. వాహనం ఇతరులకు ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి.
వృశ్చికం : ఈ రోజు మీకు రావాల్సిన పత్రాలు, రశీదులు చేతికందుతాయి. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగనిపిస్తుంది.
ధనస్సు : ఈ రోజు ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు.
మకరం : ఈ రోజు బంధువుల రాకతో మీ గృహంలో సందడి నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం వుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. అనుకోని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు వాయిదాపడుట మంచిది.
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!