Astrology: ఫిబ్రవరి 22, మంగళవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అవుతుంది. విదేశీ ప్రయాణాలు నిరుత్సాహ పరుస్తాయి. మీరు ఇతరులతో సంభాషించడం మంచిది కాదని గమనించండి. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ కనపరుస్తారు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన వ్యాపారాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. దుబారా ఖర్చులు నివారించటం సాధ్యపడక పోవచ్చు. ఒక సమస్య పరిష్కారం కావటంతో కోర్టు వాజ్యాలు ఉపసంహరించుకుంటారు.
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
మిధునం: ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. గిట్టనివారికి హితవు చెప్పి భంగపాటుకు గురవుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారి బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ కనపరుస్తారు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించటం మంచిది కాదు.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చివరి క్షణంలో చేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల రాకతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కన్య : ఈ రోజు ఈ రాశివారు ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యముగానైనా సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలతో కలహములు, అన్ని కార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. పెద్దలతో ఆస్తి వ్యవహారాలు సంప్రదింపులు జరుపుతారు.
తుల : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులు సభాసమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతగా మెలుగుతూ తమ పనులను సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటంతో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఒక విషయంలో సోదరుతో విభేదిస్తారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. స్త్రీలకు విలువైన వస్తువుల కొనుగోళ్ళలో ఏకాగ్రత వహించండి. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు విద్యార్ధుల నుండి చికాకులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపులభిస్తుంది.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని ఏజెంట్లు, బ్రోకర్లు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రజలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మకరం : ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలను ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. విశేషాలు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి. విద్యార్జనులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిర్మాణ పనులో సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని కాంట్రాక్టర్లకు రావలసిన పాత బిల్లులు మంజూరవుతాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిదికాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!