Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
- మే నెలలో అద్భుతమైన రాజయోగం..
- మిథున రాశిలో శుక్ర-బుధుల యుతి..
- ‘‘లక్ష్మీ నారాయణ యోగం’’తో 3 రాశులకు ప్రయోజనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Astrology: జ్యోతిష్యంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతంగా యోగిస్తుంది. ఇప్పుడు అలాంటి కలయిక జరగబోతోంది. శుక్ర, బుధ గ్రహాలు మిథున రాశిలో యుతి చెందడంతో అద్భుతమైన ‘‘లక్ష్మీ నారాయణ రాజయోగం’’ ఏర్పడుతోంది. మే నెలాఖరులో ఈ గ్రహాల కలయిక జరుగబోతోంది. ఈ యోగాన్ని జ్యోతిష్యంలో అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. కానీ ముఖ్యంగా మిథున, తులా, కన్య రాశుల్లో జన్మించిన వారికి ఎక్కువగా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో వృత్తిపరమైన ఎదుగుదల, కొత్త అవకాశాలు, వ్యాపార లాభాలు సాధ్యపడొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మానసిక ఉల్లాసం ఉంటుంది.
ఎప్పుడు ఏర్పడుతోంది:
Also Read
- Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
దృక్ పంచాంగం ప్రకారం, మే 14వ తేదీన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మే 29వ తేదీన బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో యుతి చెందినప్పుడు లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది.
మిథునం:
ఈ గ్రహాల కలయిక మిథున రాశిలో జరుగుతుండటం వల్ల ఈ రాశిలో జన్మించిన వారికి శుభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు, పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే పొందే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ గౌరవం, మర్యాద పెరుగొచ్చు. ఈ సమయంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేయొచ్చు జాగ్రత్త.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ కాలంలో వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండొచ్చు. మంచి లాభాలు అందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. మీ గౌరవం, గుర్తింపు పెరుగొచ్చు. ఇదే సమయంలో మానసిక ఒత్తిడి లేదా చర్మ సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
తులా రాశి:
తులారాశి వారికి ఈ గ్రహాల అద్భుత కలియిక భాగ్య స్థానమైన 9వ స్థానంలో జరుగుతోంది. ఈ సమయంలో విదేశీ సంబంధిత ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు. ఉద్యోగులకు పదొన్నతి, కొత్త బాధ్యతలు లభించొచ్చు. ఆర్థిక విషయాల్లో పురోగతి బాగుంటుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు రావచ్చు. ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విలాసాలకు దూరంగా ఉంటే మంచిది.
తాజావార్తలు
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!