ఆగస్టు 2, సోమవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : కొత్త వ్యాపారాభివృద్ధికి శ్రమించాలి. విద్యార్థులకు కోరుకున్న టెక్నికల్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్వయంకృషితో రాణిస్తారు.
వృషభం : ఆర్థికపరమైన విషయాలతో పాటు పనిలో కూడా రాజీపడవలసి వస్తుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. క్రీడా రంగాల వారికి చికాకులు తప్పవు. విద్యార్థులకు, విద్యా రంగాల వారికి మెళకువ అవసరం. వెండి, బంగారు, తాకట్టు వ్యాపారులకు శుభదాయకం.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
మిథునం : కళాకారులకు, రచయితలకు పత్రికా రంగంలో వారికి మిశ్రమ ఫలితం. దూర ప్రయాణాలు అనుకూలం. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. వాహనం విషయంలో సంతృప్తి కానవస్తుంది. క్రయ, విక్రయ రంగాలలోని వారికి ప్రోత్సాహం కానవస్తుంది.
కర్కాటకం : నరాలు, పొట్ట, కాళ్ళకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. పండ్లు, పూల, కూరగాయ వ్యాపారులకు కలిసివస్తుంది. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ధాన్య స్టాకిస్టులకు అనుకూలత. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
సింహం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. సైన్స్, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది.
కన్య : బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. గృహంలో మార్పులు, చేర్పులకు కొంతకాలం వేచివుండటం మంచిది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణామాలు ఉంటాయి. బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
తుల : వృత్తి వ్యాపారాలలో గణనీయమైన మార్పులు కానవస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. కోర్టు వ్యవహారాలు ప్రగతిపథంలో నడుస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.
వృశ్చికం : ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితం. నూతన దంపతుల మధ్య సంతానం యోగం. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి.
ధనస్సు : ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఓర్పుగా ఎలా ఉండాలో నేర్చుకోవడం ఎంతైనా అవసరం., దీర్ఘలాకి రుణాలు తీరుస్తారు. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు.
మకరం : గృహోపకరణాలు అమర్చుకుంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. రాజకీయ కళా రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారాలలో పోటీ పెరగడం వల్ల అధికంగా శ్రమించవలసి ఉంటుంది.
కుంభం : కుటుంబ విషయాలు పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడంమంచిది. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల సహాయంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
మీనం : ప్రైవేటు సంస్థలలోని వారి సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. ప్రయాణాలలోనూ, బ్యాంకు వ్యవహారాలలోనూ మెళకువ అవసరం. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు ఊహించనవి కావడంతో రుణ యత్నాలు తప్పవు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!