Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagat Singh: భారత స్వాతంత్య్ర సంగ్రామం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది గాంధీజీ ప్రతిపాదించిన అహింసా మార్గమే. కానీ, అదే ఉద్యమంలో ఒక తుఫానులా విరుచుకుపడి, తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఓ 23 ఏళ్ల యువకుడి తిరుగుబాటు కథ పాఠ్యపుస్తకాల పుటల్లో చెప్పినదానికంటే చాలా పెద్దది. ఆ పేరే భాగత్ సింగ్. ఆయన కేవలం తుపాకీ పట్టిన విప్లవకారుడు మాత్రమే కాదు. ఆలోచనలనే ఆయుధాలుగా మలిచి, సామ్రాజ్యవాద పునాదులను కదిలించిన ఒక గొప్ప పోరాట యోధుడు. నేడు ఆ వీరుడి జన్మదినం సందర్భంగా ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.. 1907 సెప్టెంబర్ 28న పంజాబ్‌లోని బంగా గ్రామంలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించిన భాగత్ సింగ్‌కు.. పుట్టుక నుంచే దేశభక్తి వంటబట్టింది. ఆయన తండ్రి కిషన్ సింగ్, బాబాయి అజిత్ సింగ్ ఇద్దరూ 1907 కెనాల్ కాలనైజేషన్ ఉద్యమంలో ఆ తర్వాత గదర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పోరాటయోధులు. చిన్నప్పటి నుంచే ఇంట్లో స్వాతంత్య్ర పోరాట వాతావరణాన్ని పీల్చుకుంటూ పెరిగిన భాగత్, లాహోర్‌లోని డిఎవి (DAV) స్కూల్లో చదివారు. ఆ తర్వాత 1923లో లాలా లజపతిరాయ్ స్థాపించిన నేషనల్ కాలేజీలో చేరారు. అక్కడే ఆయనలోని ఆలోచనాపరుడు మరింత రూపుదిద్దుకున్నాడు.
బ్రిటిష్ వారి అణచివేతను ఎదిరించడానికి 1926లో భగత్ ‘నౌజవాన్ భారత్ సభ’ను స్థాపించారు. ఆ తర్వాత ‘హిందూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్’లో చేరి, దాన్ని ‘హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్’ (HSRA)గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన గొంతుక నుంచి జారిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్ధిల్లాలి) అనే నినాదం, ఆ తర్వాత ఇరుకు సందుల నుంచి విశాల వీధుల వరకు దావానలంలా వ్యాపించి, ఊరూవాడా మారుమోగిపోయింది. బ్రిటిష్ పోలీసు అధికారి జేమ్స్ స్కాట్ చేసిన లాఠీఛార్జ్ వల్ల గాయపడి లాలా లజపతిరాయ్ ప్రాణాలు కోల్పోవడంతో దేశమంతా ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలని భాగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్‌గురు ప్రణాళిక వేశారు. 1928 డిసెంబర్ 17న పొరపాటున స్కాట్‌కు బదులు జాన్ సాండర్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని లాహోర్‌లో కాల్చి చంపారు. ఆ తర్వాత, తెల్లదొరలు తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలైన ‘పబ్లిక్ సేఫ్టీ బిల్’, ‘ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్’లకు నిరసనగా 1929 ఏప్రిల్ 8న ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భాగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ బాంబులు విసిరారు. ఎవరికీ హాని కలగకూడదనే ఉద్దేశంతో తక్కువ తీవ్రత ఉన్న బాంబులను ఖాళీ స్థలంలో విసిరి, “చెవిటివారికి వినపడాలంటే పెద్ద శబ్దమే చేయాలి” అని చాటిచెప్పారు. అక్కడి నుంచి పారిపోకుండా నవ్వుతూ లొంగిపోయారు. ఆ తర్వాత జరిగిన కోర్టు విచారణను తమ విప్లవ భావాలను, సోషలిజం సిద్ధాంతాలను దేశ మూలమూలకూ వ్యాపింపజేసే ఒక గొప్ప వేదికగా మార్చుకున్నారు.
Also Read
- India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
- Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
మన చరిత్రకారులు చాలామంది భారత స్వాతంత్య్ర పోరాటాన్ని కేవలం ఒక అహింసాయుత ఉద్యమంగానే చిత్రీకరించారు. భాగత్ సింగ్ లాంటి విప్లవకారుల పోరాటాన్ని ఒక చిన్న సంఘటనగా, తాత్కాలిక భావోద్వేగంగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ, నాటి ప్రజల్లో భాగత్ సింగ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో జవహర్లాల్ నెహ్రూ స్వయంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారిక చరిత్రకారుడు పట్టాభి సీతారామయ్య అయితే “భాగత్ సింగ్ ప్రజాదరణలో గాంధీజీతో సమానంగా నిలిచారు” అని అంగీకరించారు. రానున్న క్రమంలో భాగత్ సింగ్ అనగానే బాంబులు విసిరిన ఒక ఆవేశపరుడు లేదా టెర్రరిస్ట్ అనే ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. కానీ ఆయన స్వయంగా “నేను టెర్రరిస్టును కాను, ఎప్పుడూ కాను.. కేవలం హింసతోనే ఏదీ సాధించలేమని నాకు తెలుసు” అని స్పష్టంగా చెప్పారు. జైలు గోడల మధ్య ఆయన గడిపిన కాలంలో మార్క్స్, లెనిన్, ట్రాట్స్కీ, బాకునిన్, స్పిజోనా, డార్విన్ లాంటి గొప్ప తత్వవేత్తల పుస్తకాలను నిద్రాహారాలు మాని చదివారు. ఉరితీసేందుకు అధికారులు వచ్చే ఆఖరి నిమిషంలోనూ ఒక పుస్తకం చదువుతూ, “కొంచెం ఆగండి, ఒక విప్లవకారుడు మరొక విప్లవకారుడిని కలుస్తున్నాడు” అని చెప్పిన మహా జ్ఞాని ఆయన.
భగత్ కోరుకున్నది కేవలం బ్రిటిష్ వారి నుంచి విముక్తి మాత్రమే కాదు.. “మనిషిని మనిషి దోపిడీ చేయని” ఒక సమసమాజాన్ని! “రాజులు మారితే సరిపోదు, వ్యవస్థ మారాలి. బ్రిటిష్ Capitalists స్థానంలో భారతీయ Capitalists వచ్చి ప్రజలను దోచుకుంటే దానికి అర్థం లేదు” అని ఆనాడే హెచ్చరించారు. అందుకే ఆయన HSRA సిద్ధాంతంలో సోషలిజాన్ని చేర్చారు. ‘నౌజవాన్ భారత్ సభ’ ద్వారా రైతులు, కార్మికులే నిజమైన విప్లవ సైన్యమని చాటారు. అంతేకాదు, జైలులో రాసిన “నేనెందుకు నాస్తికుడిని” (Why I Am An Atheist) అనే రచన ఆయన మేధస్సుకు నిదర్శనం. మతాన్ని, మూఢనమ్మకాలను దాటుకుని శాస్త్రీయ ఆలోచనను అవలంబించారు. మతం పేరుతో ప్రజలను విడదీసే కుట్రలను ఆనాడే ఎండగట్టి, తన సంస్థల్లో మతోన్మాదులకు చోటు లేదని తెగేసి చెప్పారు. మతాన్ని ఓదార్పుగా కాకుండా ఆలోచనకు ఆటంకంగా మారకూడదని భావించారు.
చివరకు లాహోర్ కుట్ర కేసు పేరుతో, ఎలాంటి ప్రామాణిక న్యాయసూత్రాలు పాటించకుండా ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా భాగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు మరణశిక్ష ఖరారు చేశారు. దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. నాటి కాంగ్రెస్ నాయకుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటివారు విప్లవకారులకు మద్దతుగా నిలవగా, గాంధీజీ మాత్రం విప్లవకారుల మార్గాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. “వీరి త్యాగం వృథా, దేశానికి హానికరం” అని కూడా ఆయన భావించారు. ప్రతినిధుల సమావేశాల్లో గాంధీజీ తెచ్చిన తీర్మానాలకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గాంధీ-ఇర్విన్ ఒప్పందం సమయంలో గాంధీజీ గట్టిగా ప్రయత్నించి ఉంటే భాగత్ సింగ్ ఉరిశిక్ష రద్దయ్యేదేమో అనే చర్చ ఇప్పటికీ చరిత్రలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. విస్రాయ్ లార్డ్ ఇర్విన్ తన జ్ఞాపకాలలో రాసిన దాని ప్రకారం, గాంధీజీ ఉరిశిక్షను రద్దు చేయమని కోరినట్లు బయటకు చెప్పుకోవడానికి ఇర్విన్ సమ్మతి కోరారని తెలుస్తోంది. 1931 మార్చి 23న, లాహోర్ సెంట్రల్ జైలులో ఉరితీసే సమయానికి కూడా ఆ ముగ్గురు యువకులు భయపడలేదు. పెదవులపై చిరునవ్వుతో, దేశభక్తి గీతాలు పాడుతూ, ఉరితాళ్లను ముద్దాడారు. కేవలం 23 ఏళ్ల వయసులో భాగత్ సింగ్ చేసిన త్యాగం, ఆయన రగిల్చిన విప్లవాగ్ని ఈనాటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!