ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ లో ఓ అసభ్యకరమైన వీడియో వైరల్ ల్ అయ్యింది. ప్రస్తుతం వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో ఉన్నది బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడని తెలియడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ అధిష్టానం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడి అసభ్యకరమైన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ శుక్లా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గౌరీ శంకర్ అగ్రహరి అసభ్యకర వీడియో వైరల్ అవ్వడంతో సిద్ధార్థ్ నగర్ లో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. దీంతో పార్టీ పార్టీ హైకమాండ్ అతడిపై కఠిన చర్యలు తీసుకుంది.
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గౌరీ శంకర్ అభ్యంతర కర స్థితిలో కనిపించారని ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని చాలా మంది సీనియర్ నాయకులు ఈ విషయాన్ని.. రాష్ట్ర నాయకత్వానికి తెలియజేశారు. తర్వాత అతన్ని ఎటువంటి విచారణ చేయకుండానే పార్టీ సస్పెండ్ చేసింది.