NTV Telugu Site icon

Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా..షెడ్యూల్ ఇదే..

Amith Sha

Amith Sha

తెలంగాణలో (Telangana) ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో అధికార టీఆర్​ఎస్ (TRS)​ వైఫల్యాలను ఎండగడుతోంది. టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలంగాణలో బలపడటానికి బీజేపీ చీఫ్​ బండి సంజయ్ (Bandi sanjay) ​ కూడా ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.

గ్రామ గ్రామాలు తిరిగి టీఆర్​ఎస్​పై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులకు అండగా బీజేపీ సీనియర్​ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది.ఇవాళ మధ్యాహ్నం 2.30 కు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. ఆ తరువాత 3 గంటలకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ ని సందర్శించనున్నారు అమిత్ షా.

4.30 గంటల వరకు అక్కడే ఉండనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా… 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని నోవా టెల్ హోటల్ కి వెళ్లనున్నారు. ఇక సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడా సభాస్థలికి రానున్నారు అమిత్ షా. ఈ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రకటన చేసే ఛాన్స్‌ ఉంది. ఇక ఇవాళ రాత్రి 8 గంటలకు సభ నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్లనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. 8.25 కి తిరిగి ఢిల్లీ ప్రయాణం కానున్నారు అమిత్‌ షా. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.

బండి సంజయ్ ఏప్రిల్ 14తో తన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఉద్యోగాలు, సాగునీరు, రైతులకు రుణ మాఫీ, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల కోసం పోరాడేందుకు బండి సంజయ్​ తన పాదయాత్రను చేపట్టారని వారు తెలిపారు.

పాలమూరు (Mahbubnagar) జిల్లాలో కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు (మే 14)న మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సభకు అమిత్ షా రానున్న నేప‌థ్యంతో ఉత్కంఠ‌త చోటుచేసుకుంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై కేంద్రం, బీజేపీ రాజకీయ పోరాటం తీవ్రమవుతున్న తరుణంలో అమిత్ షా రాష్ట్రానికి రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పర్యటనలో ఆయన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శల చేస్తారు ? ఇందుకు గులాబీ బాస్ కేసీఆర్ నుంచి ఏ రకమైన రియాక్షన్ ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

LIVE:నృసింహ జయంతి సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే…

Show comments