Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబీరియాలోని ఒక ఆసుపత్రి తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. లోపలికి వెళ్లేవారిపై నిఘా..బయటకు వచ్చేవారిపై నిఘా..చుట్టూ వైద్య సిబ్బంది.. ప్రతి కదలికను గమనిస్తున్న అధికారులు..! ఆసుపత్రి మొత్తం క్వారంటైన్లోకి వెళ్లింది. బయట మాత్రం ఒకే ఒక్క భయం తిరుగుతోంది. కనిపించని ఒక వ్యాధి ఎవరి శరీరంలోకి ప్రవేశించిందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే దాదాపు 200మందిని వైద్యులు తమ పర్యవేక్షణలోకి తీసుకున్నారు. ఈ భయానికి కారణం ఒక 28 ఏళ్ల మహిళ మరణం.
ఆమె పేరు దారియా. యాంటీ ప్లేగ్ ఇన్స్టిట్యూట్లో ఆమె పనిచేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధులపై పరిశోధనలు జరిగే ప్రదేశంలో ఆమె విధులు నిర్వహిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమెకు తీవ్రమైన అనారోగ్య లక్షణాలు మొదలయ్యాయి.
పరిస్థితి వేగంగా విషమించడంతో షెలెఖోవ్లోని ఆసుపత్రికి తరలించారు. చివరికి వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. కానీ రెండు రోజుల వ్యవధిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అక్కడి నుంచి అసలు భయం మొదలైంది. ఆమెకు ప్లేగ్ సోకిందనే అనుమానం బయటకు వచ్చింది. ప్లేగ్ అనే పేరు వినగానే శతాబ్దాల క్రితం ప్రపంచాన్ని వణికించిన మహమ్మారుల జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు అదే వ్యాధి పేరు సైబీరియాలోని ఒక ల్యాబ్ ఉద్యోగి మరణంతో మళ్లీ వినిపిస్తోంది. ఇంకా కలవరపెట్టే విషయం ఆమె పనిచేసిన ప్రదేశమే. ఒక నివేదిక ప్రకారం లైవ్ ప్లేగ్ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్‌ను శాంపిల్ సేకరిస్తున్న సమయంలో ఆమె ప్రమాదవశాత్తూ పగలగొట్టి ఉండవచ్చని చెబుతున్నారు.
Also Read
మరో కథనం ప్రకారం ల్యాబొరేటరీలోని ఎలుక కాటు వల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చనే అనుమానం ఉంది. ఈ రెండు కథనాల్లో ఏది నిజమో ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. ఆమెకు సోకింది బ్యూబోనిక్ ప్లేగ్నా, ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేసే న్యూమోనిక్ ప్లేగ్నా అనే విషయంలో కూడా వచ్చిన నివేదికల్లో తేడాలు ఉన్నాయి. అధికారికంగా వ్యాధి రూపంపై వెంటనే స్పష్టత రాలేదు. అయితే అధికారులు మాత్రం సమయం వృథా చేయలేదు.
ఆమెతో సంబంధం ఉన్న 197 మందిని గుర్తించి వైద్య పర్యవేక్షణలోకి తీసుకున్నారు. వారిలో 100మందిని పైగా ఆసుపత్రుల్లో ఉంచినట్టు సమాచారం. షెలెఖోవ్ జిల్లా ఆసుపత్రిని క్వారంటైన్ చేశారు. ప్రజా కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. రష్యా అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నారు. ఇప్పటివరకు పరీక్షలు చేసిన కాంటాక్ట్స్‌లో వ్యాధి లక్షణాలు కనిపించలేదని చెబుతున్నారు. అంటే ప్రమాదం బయటకు వ్యాపించిందనే ఆధారాలు ఇప్పటివరకు కనిపించలేదు. కానీ ఈ కథలో మరో పొర ఉంది. దారియా ఇటీవల పనిచేసిన లేదా వెళ్లిన ప్రాంతాల సమీపంలో సహజంగా ప్లేగ్ వ్యాధికారక జీవులు ఉండే ప్రాంతాలు ఉన్నట్టు రష్యా వర్గాలు చెబుతున్నాయి. రష్యా మంగోలియా సరిహద్దుకు సమీపంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ప్లేగ్‌కు సంబంధించిన సహజ కేంద్రాలు ఉన్నట్టు సమాచారం. అక్కడి నుంచి కూడా వ్యాధికారక జీవి ఉన్నట్టు పరీక్షల్లో గుర్తించినట్టు నివేదికలు వెలువడ్డాయి. ఇప్పుడు అధికారులు ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే బయట ప్రపంచానికి మాత్రం ఒకే ప్రశ్న. దారియా శరీరంలోకి ఆ ప్లేగ్ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పగిలిన టెస్ట్ ట్యూబ్ నుంచా? ఒక ల్యాబ్ ఎలుక కాటు నుంచా? లేదా మనుషుల కంటికి దూరంగా సైబీరియా అడవుల్లో ఎన్నాళ్లుగానో సైలెంట్‌గా జీవిస్తున్న ఒక సహజ ప్లేగ్ కేంద్రం నుంచా? ఆ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు సైబీరియాతో ప్రపంచం కూడా ఆందోళనలోనే ఉండనుంది.
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!