HIV AIDS: ఎయిడ్స్ మరణాలు పెరుగుతున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIV AIDS: ఎయిడ్స్‌పై ప్రపంచం చేస్తున్న పోరాటం ఎన్నో మలుపులు తిరిగింది. ఒకప్పుడు మరణానికి పర్యాయపదంగా భావించిన హెచ్ఐవీ, ఇప్పుడు సరైన చికిత్సతో నియంత్రించగలిగే స్థితికి చేరుకుంది. లక్షలాది మంది ఈ వైరస్‌తో జీవిస్తూ తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. వైద్యరంగంలో వచ్చిన పురోగతి ఎన్నో కుటుంబాలకు కొత్త ఆశను అందించింది.
అయినప్పటికీ ఈ మహమ్మారి పూర్తిగా కనుమరుగవ్వలేదు. 2025లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5లక్షల70వేల మంది ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యాలతో ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతిరోజూ సుమారు 1,600 మంది. అదే ఏడాది మరో 12 లక్షల మందికి కొత్తగా హెచ్ఐవీ సోకింది. అయితే గతంతో పోలిస్తే పరిస్థితిలో భారీ మార్పు కనిపిస్తోంది. 2010తో పోలిస్తే కొత్తగా హెచ్ఐవీ బారిన పడుతున్న వారి సంఖ్య 42శాతం తగ్గింది. ఎయిడ్స్ సంబంధిత మరణాలు కూడా రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి.
Also Read
- Drought: కరువు భారతం.. తెలుగురాష్ట్రాల్లో మరింత ఘోరం!
- Explainer: మనిషి అహంకారాన్ని కూల్చిన సిద్ధాంతం.. 167ఏళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది?
- Iran: హిజాబ్ లేకుండా పాట..74 కొరడా దెబ్బల శిక్ష.. మహిళ గొంతుపై మతాధికారుల మానవ హక్కుల హననం!
- Explainer: మేనరికాలతో పిల్లలకు శాపం! దక్షిణాది మారేది ఎప్పుడు?
2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో 3.21 కోట్ల మందికి యాంటీ రెట్రోవైరల్ చికిత్స అందుతోంది. ఈ మందులు వైరస్‌ను పూర్తిగా నిర్మూలించలేకపోయినా, దాని ప్రభావాన్ని నియంత్రిస్తూ బాధితులు సుదీర్ఘకాలం జీవించేందుకు తోడ్పడుతున్నాయి. కానీ ఈ పురోగతిని నిలబెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారం ఇప్పుడు తగ్గిపోతోంది. 2025లో అంతర్జాతీయ హెచ్ఐవీ కార్యక్రమాలకు అందిన నిధులు 18 శాతం పడిపోయాయి. ముఖ్యంగా పేద దేశాల్లో నివారణ, చికిత్స సేవలకు ఇది పెద్ద అడ్డంకిగా మారుతోంది.
అమెరికా నుంచి వచ్చే ఆర్థిక సహాయం కూడా ఒక్క ఏడాదిలో 26 శాతం తగ్గింది. దీంతో హెచ్ఐవీ నివారణ కోసం పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం నివారణ సాధనాల వినియోగంపైనా కనిపిస్తోంది. హెచ్ఐవీ సోకకుండా ముందుగానే రక్షణ కల్పించే ప్రీ-ఈపీ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని ఉపయోగిస్తున్న వారి సంఖ్య తగ్గుతోంది. 83 దేశాల గణాంకాల ప్రకారం 2024 నుంచి 2025 మధ్య ప్రీ-ఈపీ వినియోగం 13 శాతం పడిపోయింది.
సెక్స్ వర్కర్లలో 59 శాతం, మత్తు పదార్థాలను ఇంజెక్షన్ల ద్వారా తీసుకునేవారిలో 58 శాతం, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల్లో 12 శాతం, స్వలింగ సంపర్కులు, ఇతర పురుషులతో లైంగిక సంబంధాలు కలిగిన పురుషుల్లో 7 శాతం తగ్గుదల నమోదైంది. కండోమ్‌ల ప్రపంచవ్యాప్త పంపిణీ కూడా 300 కోట్ల నుంచి 270 కోట్లకు పడిపోయింది. హెచ్ఐవీ వైరస్ ప్రధానంగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే సీడీ4 కణాలను దెబ్బతీస్తుంది. అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులను పంచుకోవడం, తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ వ్యాపించవచ్చు. అయితే సరైన అవగాహన, ముందస్తు నివారణ, క్రమం తప్పని చికిత్సతో దీని వ్యాప్తిని అడ్డుకోవచ్చు. 2030 నాటికి ఎయిడ్స్‌ను ప్రజారోగ్య ముప్పుగా లేకుండా చేయడం ప్రపంచం ముందున్న లక్ష్యం.
ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే 32 లక్షల కొత్త హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు 13 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలను అడ్డుకోవచ్చని UNAIDS అంచనా వేస్తోంది. ఈ ప్రయాణంలో వైద్య పరిశోధనలతో పాటు ప్రభుత్వాల సంకల్పం, ఆర్థిక సహకారం, సామాజిక సమానత్వం కూడా కీలకమే. హెచ్ఐవీతో జీవిస్తున్నవారిని వివక్షతో చూడకుండా, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలి. ఎందుకంటే ఎయిడ్స్‌పై విజయం అంటే కేవలం మరణాల సంఖ్య తగ్గడం మాత్రమే కాదు. వైరస్‌తో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ చికిత్స, రక్షణ, గౌరవం అందినప్పుడే ఆ విజయం సంపూర్ణమవుతుంది.
తాజావార్తలు
-
HIV AIDS: ఎయిడ్స్ మరణాలు పెరుగుతున్నాయా?
-
Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ – కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
-
RBI New ATM Rules 2026: ATM నుంచి డబ్బులు తీసేవారికి RBI కొత్త రూల్స్.. యూజర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
-
Natural Star Nani: యాక్షన్‌కు నాని గుడ్‌బై? మళ్లీ ఫ్యామిలీ కథల వైపు నేచురల్ స్టార్!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
ట్రెండింగ్
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!