Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని… వాళ్ల జీవితాలు నిత్యం కళకళలాడుతూ ఉండాలని కోరుకోవడం రాజ ధర్మం. ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది.. రాజు కూడా బాగుంటాడు. కానీ జనం ఆర్థిక కష్టాలతో ఏడుస్తుంటే… రాజు గారు మాత్రం తన వ్యక్తిగత ఖజానాను బంగారంతో నింపుకుంటే ఎలా ఉంటుంది…? ఆ రాజు గారు ఎవరో కాదు… మన ట్రంప్ గారే. అమెరికా అధ్యక్షుడిగా ప్రజల బాగోగులు చూడటం కంటే తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించుకోవడంపైనే ఆయన ఫోకస్ పెట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవిని అడ్డుపెట్టుకుని భారీగా లబ్ధి పొందుతున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. దేశ ప్రయోజనాల కంటే ఆయన తన సొంత వ్యాపారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ‘ఏపీ-నార్క్’ తాజా పోల్ స్పష్టం చేసింది. ట్రంప్ చట్టవిరుద్ధంగా, అనైతికంగా లాభాలు ఆర్జిస్తున్నారని మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు ఏపీ-నార్క్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ట్రంప్ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. మరో 18 శాతం మంది ఆయన చర్యలు చట్టవిరుద్ధం కాకపోయినా నైతికంగా తప్పని భావిస్తున్నారు. మొత్తం మీద 59 శాతం మంది ప్రజలు ఆయన అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని అభిప్రాయపడ్డారు. 56 శాతం మంది ట్రంప్ తన సొంత వ్యాపార ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు.
గత రెండేళ్లలో ట్రంప్ సంపద అసాధారణ స్థాయిలో పెరిగిందని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ విశ్లేషించింది. విదేశీ పెట్టుబడులు ఆయన కుటుంబ ప్రాజెక్టులలోకి భారీగా రావడం ఆందోళన కలిగిస్తోందని ఆ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్లు చెబుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజ కుటుంబానికి చెందిన ఒక సంస్థ ట్రంప్ క్రిప్టో వ్యాపారాల్లో అర బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. జూన్ 30న వెల్లడించిన ఆర్థిక నివేదిక ప్రకారం గత ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టుల నుంచి ఆయన 1.4 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించారు. 2025 కోసం సమర్పించిన 927 పేజీల నివేదికలో ట్రంప్ మొత్తం ఆదాయం 2.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ట్రంప్ సంస్థ మిడిల్ ఈస్ట్లో… ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను విస్తరించింది.
Also Read
- Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
దేశ ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఇలాంటి అవినీతి ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ అవినీతి అంశం తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, ఇరాన్ తో యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇంటి పచారీ వస్తువుల నుంచి ఇంధన ధరల వరకు అన్నీ విపరీతంగా పెరగడంతో సామాన్యులపై మోయలేని భారం పడుతోంది. ప్రభుత్వ విధానాల కారణంగా తమ జేబులకు చిల్లులు పడుతుంటే.. అధ్యక్షుడు మాత్రం తన కుటుంబ ఖజానాను పెంచుకునే పనిలో ఉన్నారని అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటిలో అధ్యక్ష పదవి అత్యంత అవినీతిమయమైందని 53 శాతం మంది గట్టిగా నమ్ముతున్నారు….
ట్రంప్ అవినీతి సంపాదన వచ్చే నెలలో జరిగే మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ఛాన్సెస్ ఉన్నాయి. హౌస్…సెనేట్ లో పట్టు నిలుపుకోవాలని రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ట్రంప్ వ్యాపార వ్యవహారాల పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి కింది స్థాయి రిపబ్లికన్ అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!